Zomato Delivery Partner: వేరే వాళ్ల ఆర్డర్ తీసుకుని మరీ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి.. వీడియో వైరల్

వేరే వాళ్ల కోసం తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా.. ఆ ఫుడ్ తెచ్చిన డెలివరీ పార్ట్‌నర్‌పై బూటుతో దాడి చేసిందో యువతి. ఈ ఘటనను అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Zomato Delivery Partner: వేరే వాళ్ల ఆర్డర్ తీసుకుని మరీ డెలివరీ బాయ్‌పై దాడి చేసిన యువతి.. వీడియో వైరల్

Updated On : August 23, 2022 / 7:09 PM IST

Zomato Delivery Partner: వేరేవాళ్ల కోసం వచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా, ఆ ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చిన పార్ట్‌నర్‌పైనే దాడి చేసిందో యువతి. ఈ ఘటన కర్ణాటకలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడున్న వారు రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Raja Singh: పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సంబంధిత యువకుడు ట్వీట్ చేశాడు. ఆ యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు జొమాటోలో ఒక ఫుడ్ ఆర్డర్ చేశాడు. అది డెలివరీ చేయడానికి ఒక పార్ట్‌నర్ వచ్చాడు. అయితే, అతడి దగ్గరి నుంచి ఫుడ్ తీసుకున్న వేరే యువతి అతడిపైనే దాడి చేసింది. బూతులు తిడుతూ, బూటుతో కొట్టింది. నిజానికి ఫుడ్ తీసుకున్న ఆ యువతికి, ఫుడ్ ఆర్డర్ చేసిన వ్యక్తికి ఏం సంబంధం లేదు. తన కోసం డెలివరీ పార్ట్‌నర్ తెచ్చిన ఫుడ్ తీసుకోవడమే కాకుండా, అతడిపైనే బూటుతో యువతి దాడి చేసిందని ఆ యువకుడు తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ఘటనపై జొమాటోకు ఫిర్యాదు చేసి, డెలివరీ పార్ట్‌నర్‌కు సహాయం చేయమని కోరినప్పటికీ, ఆ సంస్థ నుంచి సరైన స్పందన లేదని ఆ యువకుడు వెల్లడించాడు.

Sisters Suicide: అన్న తిట్టాడని విషం తాగి చెల్లెళ్ల ఆత్మహత్య

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అకారణంగా డెలివరీ పార్ట్‌నర్‌పై దాడి చేసిన యువతిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. యువతి తీరును తప్పుబడుతున్నారు. మరోవైపు ఈ వీడియో వైరల్ అయిన తర్వాత జొమాటో స్పందించింది. ఈ విషయాన్ని పరిశీలిస్తామని, డెలివరీ పార్ట్‌నర్‌తో మాట్లాడతామని ప్రకటించింది.