polytechnic colleges posts
Polytechnic Colleges Lecturer Posts : తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. పాలిటెక్నిక్ కాలేజీతల్లో లెక్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటికే గ్రూప్-4 నోటిఫికేషన్(9,168 ఉద్యోగాలు), మెడికల్ ఎడ్యుకేషన్ లో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. మొత్తం 19 సబ్జెక్టుల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.
ఈ నెల 14 నుంచి జనవరి 4వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in వెబ్ సైట్ ను లాగిన్ కావొచ్చు.