Student Complaint
second-grade student : రెండో తరగతి చిన్నారి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తనను కొడుతున్నారంటూ టీచర్లపై ఫిర్యాదు చేశాడు. మెడిటేషన్ చేస్తుంటే తనను చితకబాదుతున్నారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. తనని కొట్టిన టీచర్లను అరెస్ట్ చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు.
పోలీసులంటే భయం లేదు.. ఖాకీలంటే కంగారు లేదు. పెద్దోళ్లే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాలంటే భయపడిపోతారు. కానీ ఆ బాబు ఏ మాత్రం భయపడలేదు. స్కూలు నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్‌కే వెళ్లాడు. డైరెక్టుగా ఎస్సై దగ్గరికే వెళ్లాడు. తనని కొడుతున్నారంటూ పాఠాలు చెప్పే టీచర్లపై ఫిర్యాదు చేశాడు. విచారణ జరుపుతామని చెప్పినా వినిపించుకోలేదు.
Himachal Pradesh: విద్యార్థినిని చితకబాదిన కేసు.. టీచర్‌కు లక్ష ఫైన్!
వెంట ఉండి.. స్కూల్‌కి పోలీసులు వెళితే కానీ ఊరుకోలేదు. తన ముందు వారికి కౌన్సిలింగ్ ఇచ్చే దాకా ఆగలేదు. కౌన్సిలింగ్ ఇచ్చినా.. టీచర్లను వదిలేది లేదంటున్నాడు బాబు. అరెస్టు చేయాల్సిందే అంటున్నాడు. తనను మరోసారి కొట్టడానికి వీల్లేకుండా కోటింగ్ ఇవ్వాలంటున్నాడు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నవీన్ రెండో తరగతి చదువుతున్నాడు. అయితే అతన్ని టీచర్లు కొట్టడంతో తట్టుకోలేకపోయాడు. నేరుగా పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ చేశాడు.
Himachal Pradesh: విద్యార్థినిని చితకబాదిన కేసు.. టీచర్‌కు లక్ష ఫైన్!
ఆ రోజు కొట్టిన టీచర్‌పైనే కాదు.. అంతకుముందు మందలించిన సారుపైనా ఫిర్యాదు చేశాడు. అరెస్టు చేయాల్సిందే అంటూ డిమాండ్ చేశాడు. బాబు కంప్లైంట్‌తో స్కూల్‌కి వెళ్లిన పోలీసులు.. టీచర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. పిల్లలను కొట్టకూడదంటూ సూచించారు.