Himachal Pradesh: విద్యార్థినిని చితకబాదిన కేసు.. టీచర్‌కు లక్ష ఫైన్!
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన టీచర్ ఓ విద్యార్థినిపై వ్యక్తిగత ద్వేషం పెంచుకొని బాలికని చితకబాదడమే కాక ఆమె కులాన్ని ఉద్దేశించి దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు..

Himachal Pradesh
Himachal Pradesh: విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను తీర్చి దిద్దాల్సిన టీచర్ ఓ విద్యార్థినిపై వ్యక్తిగత ద్వేషం పెంచుకొని బాలికని చితకబాదడమే కాక ఆమె కులాన్ని ఉద్దేశించి దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో కోర్టు ఆ ఉపాధ్యాయురాలికి లక్ష రూపాయల జరిమానా లేదంటే ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ కీలక తీర్పునిచ్చింది.
AP PRC : జగన్‌ను కలువనున్న ఉద్యోగ సంఘాలు
హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్‌పుర్‌లో 2019లో ఓ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న రజనీకుమారి అనే ఉపాధ్యాయురాలిపై హమీర్పుర్ స్టేషన్లో కేసు నమోదైంది. నాలుగోతరగతి చదువుతున్న విద్యార్థిపై ఉపాధ్యాయురాలు రజనీ కుమారి వ్యక్తిగత కక్షతో చితకబాదడమే కాక.. బాలిక కులంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఉంది.
Steering Committee : స్టీరింగ్ కమిటీలో విభేదాలు.. కార్యాచరణ ప్రకటిస్తామన్న ఉపాధ్యాయ సంఘాలు
దీంతో హమీర్పుర్ పోలీసులు ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా ఈ కేసును విచారించిన జిల్లా సెషన్స్ జడ్జి జేకే శర్మ తాజాగా ఈమేరకు తీర్పునిచ్చారు. బాలికను కించపరచడం, గాయపరచడంపై తీవ్రంగా స్పందించిన జడ్జి ఉపాధ్యాయురాలికి లక్ష జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించారు.