AP PRC : జగన్‌‌ను కలవనున్న ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని... తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్‌...

AP PRC : జగన్‌‌ను కలవనున్న ఉద్యోగ సంఘాలు

Ap Prc Jagan

Andhra Pradesh Employees unions : ఏపీలో ఉద్యోగుల పీఆర్సీ పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి ఉద్యోగ సంఘాలు. ఈనెల 7నుంచి సమ్మె నిర్వహిస్తామన్న ఉద్యోగులు… ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులంతా విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు ఉద్యోగ సంఘం నేతలు. అంతేకాదు… 2022, ఫిబ్రవరి 06వ తేదీ ఆదివారం సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు.

Read More : Tollywood: సోమవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక సమావేశం

7వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామని ఉద్యోగులు ప్రకటించడంతో.. వారి డిమాండ్లపై లోతుగా అధ్యయనం చేసింది మంత్రుల కమిటీ. సీపీఎస్‌ రద్దు, ఐదేళ్లకు పీఆర్సీ అమలులాంటి డిమాండ్లకు అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు.. ప్రొబెషనరీ సమయం ముగిసిన తర్వాత పీఆర్సీ అమలు చేస్తామని హామీ నిచ్చింది. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులను పెంచడానికి అంగీకరించింది. 50వేల జనాభా ఉన్న చోట 10శాతం, 50వేల నుంచి 2 లక్షల జనాభా ఉన్నచోట 12శాతం, 2 లక్షల నుంచి 50 లక్షల వరకు జనాభా ఉన్నచోట 16శాతం, 50లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో 24శాతం హెచ్‌ఆర్‌ఏను అమలు చేస్తామని హామీనిచ్చింది ప్రభుత్వం. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా 24శాతం హెచ్‌ఆర్‌ఏ అమలు చేయనున్నట్టు తెలిపింది. అయితే… ఫిట్‌మెంట్‌ను మాత్రం పెంచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

Read More : U19 World Cup: ఐదోసారి అండర్ 19 వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన యంగ్ ఇండియా

ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిందని… తాము ప్రభుత్వం ముందుంచిన ప్రధాన డిమాండ్లను నెరవేర్చుతామని హామీ నిచ్చిందన్నారు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాస్‌. మంత్రుల కమిటీతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చించామని… తమకు జరిగిన అన్యాయం గురించి వివరించామన్నారు. ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి ప్రభుత్వం తమకు మేలు చేసిందన్నారు. అందుకే తాము సమ్మె చేయాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. మొత్తం 17 అంశాలపై సానుకూల ఒప్పందం కుదిరిందన్నారు.