Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు.. టాయిలెట్లు కడిగిన మంత్రి

పాఠశాలకు వెళ్లిన మంత్రి తోమర్ చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్ల గదులకు వెళ్లారు. అక్కడ నీళ్లు పోస్తూ..శుభ్రం చేశారు.

Madhya Pradesh : విద్యార్థిని ఫిర్యాదు.. టాయిలెట్లు కడిగిన మంత్రి

Minister

Pradhuman Singh Tomar Cleaned The Toilet : పాఠశాలలో టాయిలెట్లు సరిగ్గా లేవు సార్..దీనివల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటున్నామని ఓ విద్యార్థిని ఫిర్యాదు మంత్రికి ఫిర్యాదు చేసింది. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేయలేదు. స్వయంగా రంగంలోకి దిగారు. ఆ పాఠశాలకు వెళ్లి టాయిలెట్లను కడిగి శుభ్రం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గ్వాలియర్ లో ఉన్న ఓ పాఠశాలలో టాయిలెట్లు మంచిగా లేవంటూ..ఓ విద్యార్థిని విద్యుత్ శాఖ మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ కు ఫిర్యాదు చేసింది.

Read More : Marriage Age : 18 ఏళ్లకే ఓటేస్తున్నారు..అదే వ‌య‌స్సులో పెళ్లి ఎందుకు చేసుకోకూడదు..?

ఆ పాఠశాలకు వెళ్లిన మంత్రి తోమర్ చీపురు, బ్రష్ పట్టుకుని టాయిలెట్ల గదులకు వెళ్లారు. అక్కడ నీళ్లు పోస్తూ..శుభ్రం చేశారు. టాయిలెట్లున్న పరిసర ప్రాంతాల్లో చెత్త శుభ్రం చేశారు. పాఠశాలలో ఉన్న టాయిలెట్లను శుభ్రంగా ఉంచాలని అక్కడున్న వారికి చెప్పారు. పాఠశాలలో ఉన్న సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం లేదని విద్యార్థిని చెప్పడంతో తాను ఈ పని చేయడం జరిగిందని మీడియాకు తెలిపారు మంత్రి తోమర్.

Read More : Cryptocurrency: క్రిప్టో కరెన్సీ నిషేధమేనా? ఆర్‌బీఐ ప్రతిపాదన ఇదే.. కేంద్రం ఏం ఆలోచిస్తోంది?

అయితే..మంత్రి ప్రధుమాన్ సింగ్ తోమర్ ఇలాంటి పనులు చాలానే చేశారు. గ్వాలియర్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో టాయిలెట్లు క్లీన్ గా ఉంచడం లేదని ఫిర్యాదు రావడంతో స్వయంగా వాటిని కడిగి క్లీన్ చేశారాయన. ఇటీవలే ఈ నియోజకవర్గంలో బిర్లానగర్ లో 16వ వార్డులో ఉన్న కాల్వలను క్లీన్ చేశారు. అంతేగాకుండా…విద్యుత్ స్తంభం ఎక్కి…దానిపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు.