twist in the Norshing attack incident
Narsingi Attack incident : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి..విచారణకు వెళ్లిన పోలీసులపై దాడి,మరికొందరు అనుమానితులు పోలీసులు విచారణ కోసం నార్శింగ్ పీఎస్ కు పిలిపించగా ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే సీఐపై దాడికి యత్నించారు కరణ్ సింగ్ కుటుంబ సభ్యులు. ఈ నార్శింగ్ దాడి ఘటనలో మరో ట్విస్ట్ బయటపడింది.
జనవరి 4న రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై దారి దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి వెనుక ఉన్న అసలు ఘటన పోలీసుల విచారణలో బయటపడింది. కిషోర్ కుమార్ అతని స్నేహితుడు బైక్ పై వెళుతుండగా కరణ్ సింగ్ గ్యాంగ్ హిజ్రాలను లైంగికంగా వేధిస్తుండటం కిషోర్ కుమార్ కంటపడింది. దీంతో బైక్ దిగి హిజ్రాలను కాపాడటానికి యత్నించారు. దీంతో కరణ్ సింగ్ గ్యాంగ్ రెచ్చిపోయింది. కిషోర్ కుమార్ అతని స్నేహితుడిపై దాడికి దిగారు. ఈ ఘటనలో కిషోర్ కుమార్ ప్రాణాలు కోల్పోగా అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డారు. కరణ్ సింగ్ గ్యాంగ్ నుంచి హిజ్రాలను కాపాడటానికి వచ్చిన కిషోర్ కుమార్ అతని స్నేహితుడిపై కరణ్ సింగ్ గ్యాంగ్ దాడి చేసిందని వెల్లడైంది.
దాడిలో కిషోర్ కుమార్ అక్కడిక్కడే చనిపోగా తీవ్ర గాయాలతో కరణ్ సింగ్ గ్యాంగ్ నుంచి తప్పించుకున్న అతని స్నేహితుడు నార్శింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం విచారణకు వెళ్లిన పోలీసులపైనే కరణ్ సింగ్ గ్యాంగ్ కత్తులతో దాడి చేయటం ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలు కావటం వారిని ఆస్పత్రికి తరలించటం వంటి ఘటనలు జరిగాయి. ఈక్రమంలో శుక్రవారం (జనవరి 6,2023) మరింతమంది అనుమానితులను సీఐ నార్శింగ్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రప్పించగా నిందుతుల కుటుంబ సభ్యులు ఏకంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి సీఐపై దాడికి యత్నించారు. ఇలా కరణ్ సింగ్ గ్యాంగ్ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయపడుతున్నాయి. ఈ కేసు విచారణను పోలీసులు కొనసాగిస్తున్నారు.
Thieves Attacked Police : దారి దోపిడి కేసులో విచారణకు వెళ్లిన పోలీసులు.. కత్తులతో దాడి చేసిన దొంగలు