Thieves Attacked Police : దారి దోపిడి కేసులో విచారణకు వెళ్లిన పోలీసులు.. కత్తులతో దాడి చేసిన దొంగలు

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు.

Thieves Attacked Police : దారి దోపిడి కేసులో విచారణకు వెళ్లిన పోలీసులు.. కత్తులతో దాడి చేసిన దొంగలు

ATTACK

Updated On : January 5, 2023 / 11:01 PM IST

Thieves attacked police : రంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. దారి దోపిడి దొంగల కేసులో విచారణకు వెళ్లిన ఎస్ఓటీ పోలీసులపై దొంగలు దాడి చేశారు. దొంగలను పట్టుకోవడానికి వెళ్లిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందుతులను అరెస్ట్ చేశారు. నిన్న రక్త మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళ్తున్న కిషోర్ కుమార్ రెడ్డితో పాటు మరో వ్యక్తిపై దారి దోపిడీ దొంగలు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో కిషోర్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఘటన స్థలంలోనే మృతి చెందాడు.

Thieves : రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. అర్ధరాత్రి ఇద్దరిపై దాడి.. ఒకరు మృతి

మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. దొంగలు బాధితుడి నుంచి 15 వేల రూపాలయలు చోరీ చేశారు. దొంగల నుంచి తప్పించుకున్న బాధితుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. పోలీసులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు.