శంషాబాద్‌లో మద్యం మత్తులో గన్‌తో యువకుడి హల్‌చల్‌

  • Publish Date - November 21, 2020 / 11:11 AM IST

Shamshabad young man gun : హైదరాబాద్ శంషాబాద్‌లో ఎయిర్ పోర్ట్‌ కార్గో ఉద్యోగి సొహెయిల్‌ గన్‌తో హల్‌చల్ చేశాడు. నడుముకు గన్ తగిలించుకుని అటూ ఇటూ తిరగడంతో స్థానికులు భయాందోళన చెందారు. CISF సెక్యూరిటీ వింగ్‌లో పని చేస్తానని చెప్పిన ఆ యువకుడి ప్రవర్తనపై అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళన చెందారు.



శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా గన్ నిజమైంది కాదని, ఎయిర్‌ గన్‌ అని తేలింది. బేగంపేటకు చెందిన అతను ఎయిర్ పోర్ట్‌ కార్గోలో ఉద్యోగం చేస్తున్నట్టు గుర్తించారు. తను ఉద్దేశంతో చేశాడా వేరే కారణంతో చేశాడా అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది.



https://10tv.in/kamareddy-ci-jagadish-arrested-in-corruption-case/
మద్యం మత్తులో ఉన్న సమయంలో ఈవిధంగా ప్రవర్తించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలకు ఎప్పుడైనా పాల్పడ్డాడా? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులోనే డమ్మీ ఎయిర్ గన్ పెట్టుకుని తిరిగినట్లు తేల్చేశారు.