Ameerpet Metro Station : అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువతి
హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.
- bheemraj
- Published On : November 12, 2021 / 08:19 PM IST
Metro
young woman jumps from the metro station : హైదరాబాద్ అమీర్ పేట్ మెట్రో స్టేషన్ లో కలకలం రేగింది. మెట్రో స్టేషన్ పైనుంచి ఓ యువతి కిందికి దూకింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
మెట్రో స్టేషన్ ఫస్ట్ ఫ్టోర్ నుంచి యువతి కిందికి దూకింది. యువతి తలకు, వెన్ను భాగంలో గాయాలైనట్లు తెలుస్తోంది. లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను అంబులెన్స్ లో హుటాహుటినా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువతి వివరాలు తెలియాల్సివుంది.
Ponnam Prabhakar : హుజూరాబాద్‌లో ఓటమిపై కాంగ్రెస్ రివ్యూ చేయడం పట్ల పొన్నం ప్రభాకర్ సీరియస్
పోలీసులు యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. యువతి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు. దూకిందా లేక పొరపాటున పడిపోయిందా అన్నదానిపై విచారణ చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఆమె వెంట సోదరులు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. యువతి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.
యువతి ప్రమాదవశాత్తు పడిపోయిందా? లేదా ఆత్మహత్యకు పాల్పడిందా? లేదా పైనుంచి ఎవరైనా నెట్టేశారా?యువతి ఎవరనే విషయాలు తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
KRMB : తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ
ప్రత్యక్ష సాక్షి..
అమీర్పేట్ మెట్రో స్టేషన్ పై నుండీ యువతి కింద పడింది. రాత్రి 7 గంటల ప్రాంతంలో యువతి మెట్రోపై నుంచి పడింది. శబ్దం రాగానే వెంటనే యువతి వద్దకు పరిగెత్తాం. వెంటనే 108 తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాం. అంబులెన్స్ లో యువతిని పోలీసులు హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారు. యువతి తో పాటు వారి బ్రదర్స్ ఉన్నారు. ఆమె బంధువులు వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
