KRMB : తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది.

KRMB : తెలంగాణ, ఏపీ ఈఎన్సీలకు కేఆర్‌ఎంబీ లేఖ

Krmb

Updated On : November 12, 2021 / 9:36 PM IST

KRMB letter to TS and AP ENCs : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఈఎన్సీలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) లేఖ రాసింది. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల సమగ్ర సమాచారం ఇవ్వాలని కోరింది. ఇప్పటిదాకా వినియోగించిన నీటి లెక్కలు చెప్పాలని లేఖలో పేర్కొంది.

నీటి ప్రవాహం, గేట్ల నిర్వహణ, వందేళ్ల వరద వివరాలు, రిజర్వాయర్‌ రూటింగ్‌ స్టడీ రిపోర్టులు ఇవ్వాలంది. అలాగే 30 ఏళ్ల నీటి డిమాండ్‌ వివరాలు సమర్పించాలని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది.

Fire Broke Out : విజయనగరం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..30 ఇళ్లు దగ్ధం

శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టుల వివరాలు తక్షణమే ఇవ్వాలన్న బోర్డు.. వీలైనంత త్వరగా సమాచారం అందించాలని కోరింది. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల్లో ఆయా రాష్టాలు ఇప్పటి వరకు వినియోగించుకున్న నీటి లెక్కల వివరాలు తెలియజేయాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉప సంఘం భేటీ హైదరాబాద్‌ జలసౌధలో కానుంది. గోదావరి బోర్డు ఉప సంఘం భేటీలో దేవాదుల, తొర్రిగెడ్డ ఎత్తిపోతల పంప్‌హౌస్‌, చాగలనాడు ఎత్తిపోతలు, కాకతీయ కాల్వ క్రాస్‌ రెగ్యులేటర్‌ అంశంపై చర్చ జరుగనుంది.