Nirmal District: పోలీసుల వలయంలో బాసర ట్రిపుల్ ఐటీ.. రైల్వే స్టేషన్‌లో విస్తృత తనిఖీలు..

ర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి ..

Nirmal District

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. ట్రిపుల్ ఐటీ ముట్టడికి రాష్ట్ర ఏబీవీపీ పిలుపునివ్వడంతో వివిధ ప్రాంతాల నుండి ట్రిపుల్ ఐటీ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ట్రిపుల్ ఐటీకి చుట్టుపక్కల రెండు కిలో మీటర్ల మేర ఆంక్షలు విధించారు. మీడియాపైనా ఆంక్షలు విధించారు. మీడియాను అడ్డుకొని అక్కడి నుంచి పోలీసులు వెనక్కి పంపించారు. ట్రిపుల్ ఐటీ సమీపంలో మీడియాను అనుమతించవద్దని జిల్లా ఎస్పీ ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసులు చెప్పారు.

Also Read: సీఎం రేవంత్ స‌వాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు.. ఇవాళ మూసీ నిద్ర.. ఎవరెవరు ఎక్కడ బస చేస్తారంటే?

బాసర ఆలయం, రైల్వే స్టేషన్, బస్టాండ్, బిద్రేల్లి సమీపంలో ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నడూలేని విధంగా జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనూ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన ఏబీవీపీ కార్యకర్తలను ముధోల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాసర రైల్వే స్టేషన్ లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ప్రతి ప్రయాణికుడిని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. బాసరకు సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.