సీఎం రేవంత్ స‌వాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు.. ఇవాళ మూసీ నిద్ర.. ఎవరెవరు ఎక్కడ బస చేస్తారంటే?

మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు.

సీఎం రేవంత్ స‌వాల్‌ను స్వీకరించిన బీజేపీ నేతలు.. ఇవాళ మూసీ నిద్ర.. ఎవరెవరు ఎక్కడ బస చేస్తారంటే?

Revanth Reddy and Kishan Reddy

Updated On : November 16, 2024 / 8:55 AM IST

Kishan Reddy: మూసీ వద్ద నిద్రపోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసీ వద్దే నిద్రిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో శనివారం బీజేపీ నేతలు మూసీ ప్రాంతాల్లో పర్యటించి అక్కడే బస చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4గంటల నుంచి 17వ తేదీ (రేపు) ఉదయం 9గంటల వరకు మూసీ పరిధిలోని బస్తీవాసులతో మమేకం అవుతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది బీజేపీ ముఖ్యనాయకులు బస్తీ నిద్ర చేయనున్నారు. ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు, ఎనిమిది జిల్లాలకు సంబంధించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు పాల్గొనున్నారు.

Also Read: Rani Rudrama Devi : రేవంత్ రెడ్డి దమ్ముంటే బుల్డోజర్స్ పట్టుకొనిరా!

కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని, మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర పోగలరా అంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఉద్యమ రీతిలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇండ్లలోనే బీజేపీ నాయకుల బృందమంతా నిద్రచేస్తుందని, వారికి భరోసా కల్పిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. అదేవిధంగా ఎట్టిపరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇండ్లను కూల్చనివ్వమని బీజేపీ నేతలు చెబుతున్నారు. మూసీ సుందరీకరణ – పునరుజ్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని డిమాండ్
బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. రాష్ట్ర సమస్యలపై కేంద్ర మంత్రులకు వినతులు..

బీజేపీ ముఖ్యనేతలు ఎవరెవరు ఎక్కడ బస చేస్తారంటే?
♦  అంబర్ పేట్ (తులసీరామ్ నగర్ ) – కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – జి.కిషన్ రెడ్డి.
♦  రాజేంద్రనగర్ (హైదర్ షాకోట్) – పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
♦  ఎల్బీనగర్ (ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్) – పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్.
♦  ఓల్డ్ మలక్ పేట్ (శాలివాహన్ నగర్) – రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్.
♦  అంబర్ పేట్ (కమలానగర్) – మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి.
♦  మేడ్చల్ రూరల్ (ఘట్ కేసర్) – మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు.
♦  గోషామహల్ నియోజకవర్గం గౌలిగూడ లో -ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి.
♦  అఫ్జల్ గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీ -బీబీ పాటిల్.
♦  జుమ్మెరాత్ బజార్ – సీతారాం నాయక్