Telangana ACB: తెలంగాణ ఏసీబీ దూకుడు.. నెల రోజుల్లో 21 కేసులు.. కటకటాల్లోకి ప్రభుత్వ అధికారులు..

ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పని చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే 1064 కాల్ చెయ్యాలని ఏసీబీ అధికారులు తెలిపారు.

Telangana ACB: తెలంగాణ ఏసీబీ దూకుడు చూపిస్తోంది. అవినీతిపరుగుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. అక్రమార్కుల భరతం పడుతోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఏసీబీ 21 కేసులు నమోదు చేసింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తోంది ఏసీబీ. 13 ఏసీబీ ట్రాప్ కేసులు, 2 అక్రమాస్తుల కేసులు, 2 క్రిమినల్ దుష్ప్రవర్తన కేసులు, 2 ఆశ్చర్యపరిచే తనిఖీ కేసులు, 2 సాధారణ కేసులు ఉన్నాయి.

20 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. వారంతా రిమాండ్ లో ఉన్నారు. 5.02 లక్షల సొమ్మును ఏసీబీ సీజ్ చేసింది. ఒక అధికారి ఇంట్లో రూ.3.51 కోట్ల అక్రమాస్తుల గుర్తించారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఏదైనా పని చేసేందుకు లంచం డిమాండ్ చేస్తే 1064 కాల్ చెయ్యాలని ఏసీబీ అధికారులు తెలిపారు.

Also Read: బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ ఎవరు? ఏం జరుగుతోంది?