కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు.. 16న మళ్లీ విచారణ

గతంలోనూ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.

KTR

ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు పంపింది. జూన్‌ 16న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని చెప్పింది.

గతంలోనూ కేటీఆర్‌కు నోటీసులు అందించిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్‌ రేసులో కేటీఆర్‌కు ఏసీబీ మే 26న కూడా నోటీసులు ఇచ్చి, అదే నెల 28న విచారణకు రావాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

Also Read: వన్‌ప్లస్ నార్డ్ 5 ధర, ఫీచర్లు లీక్.. చూస్తే ఆశ్చర్యపోతారు..

కాగా, జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్‌ హాజరయ్యారు. అంతకుముందు రెండు రోజుల క్రితం విచారణకు తమ న్యాయవాదిని అనుమతించక పోవడంతో కేటీఆర్‌ వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్‌ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.

దీంతో తనతో విచారణ వేళ న్యాయవాదిని అనుమతించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు అనుమతించింది. జనవరి 9న కేటీఆర్‌ విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.

హైదరాబాద్‎లో గత బీఆర్ఎస్ సర్కారు ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించింది. ఇందులో అవకతవకలు జరిగినట్లు కాంగ్రెస్ సర్కారు గుర్తించి, విచారణ చేయిస్తోంది. కేటీఆర్ ఆదేశాలతో రూ.55 కోట్లు ఆర్‌బీఐ అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు తరలించారని కేసు నమోదైంది. ఈ కేసులో ఏ1గా కేటీఆర్‌గా ఉన్నారు.