×
Ad

ACB Raids: వామ్మో.. ఈ ప్రభుత్వ ఉద్యోగి ఆస్తులు 100 కోట్లు పైనే..! పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటళ్లు ఇంకా..

కిషన్ నాయక్ భార్య అకౌంట్ లో కోటి రూపాయల నగదును గుర్తించారు.

ACB Raids: ఆయన ఓ ప్రభుత్వ ఉద్యోగి. కానీ, ఆయన ఆస్తుల గురించి తెలిస్తే అవాక్కవ్సాల్సిందే. ఆ ఉద్యోగి ఆస్తులు రూ.100 కోట్లపైనే ఉంటాయి. ఏంటి షాకయ్యారా? రాష్ట్రంలో మరో భారీ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద కళ్లు చెదిరే ఆస్తులను ఏసీబీ గుర్తించింది. కిషన్ నాయక్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు.

కిషన్ నాయక్ పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ కు చెందిన కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు జరిపింది. ఈ సోదాల్లో ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకుని అధికారులే షాక్ అయ్యారు. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలతో పాటు 6 చోట్ల మొత్తం 12 బృందాలతో సోదాలు నిర్వహించారు. సోదాల్లో కిషన్ నాయక్ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్ తో పాటు కేజీకి పైగా బంగారాన్ని గుర్తించారు. కిషన్ నాయక్ భార్య అకౌంట్ లో కోటి రూపాయల నగదును గుర్తించారు. కిషన్ నాయక్ కు 40 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. 13 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి అధికారులు.. కిషన్ నాయక్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. బహిరంగా మార్కెట్ లో కిషన్ నాయక్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. కిషన్ నాయక్ పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్ లు, హోటళ్లతో పాటు స్థిర, చరాస్తులు కలిగున్నట్లు గుర్తించారు. ఇక బ్యాంకు లాకర్లలో 3 కేజీల బంగారం ఉన్నట్లు గుర్తించారు.

* నిజామాబాద్ లో లహరి ఇంటర్నేషనల్ హోటల్
* భార్య బ్యాంకు ఖాతాలో కోటి 30 లక్షల నగదు
* నిజామాబాద్ లో అపార్ట్ మెంట్
* మెదక్ నిజాంపేట్ లో 30 ఎకరాలకు పైగా పంట భూములు
* సుమారు 10 లక్షల కమర్షియల్ ల్యాండ్ గుర్తింపు
* డాక్యుమెంట్ ప్రకారం ఆస్తుల విలువ 13 కోట్లు