సూర్యాపేట, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో ఏసీబీ దాడులు
ACB raids: సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్‌ను అరెస్టు చేశారు.

తెలంగాణలోని సూర్యాపేట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆఫీసు తలుపులు మూసి వేసి సిబ్బందిని విచారించారు. సూర్యాపేట సబ్ రిజిస్ట్రార్ సురేందర్ నాయక్‌ను అరెస్టు చేశారు. 1,200 గజాల స్థలం గిఫ్ట్ డీడ్ కోసం 99 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.
మధ్యవర్తులుగా ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు. వారిద్దరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ వివరాలను నల్గొండ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ వివరాలు వెల్లడించారు. మరోవైపు, మేడ్చల్ మల్కాజ్ గిరి పరిశ్రమల శాఖ ఏడీ వెంకట్ నర్సిరెడ్డిపై ఏసీబీ సోదాలు చేశారు. 45 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో పరిశ్రమల శాఖ ఏడీ చిక్కుకున్నారు.
వెంకట్ నర్సి రెడ్డిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమ అనుమతి కోసం లంచం డిమాండ్ చేశారు వెంకట్ నర్సిరెడ్డి. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. నర్సిరెడ్డి నివాసం, కార్యాలయంలో ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.
Also Read: గుండెలు అదిరిపోయే రోడ్డు ప్రమాదం..! కారుతో గుద్దితే గాల్లోకి ఎలా ఎగిరిపడ్డారో చూడండి..