ACB Raids : నీటిపారుదల శాఖ ఉద్యోగి ఇంట్లో ఏసీబీ రైడ్స్.. అతడికి ఉన్న ఆస్తులు చూసి షాక్..
గతంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన నిఖేశ్ కుమార్ సస్పెన్షన్ కు గురయ్యాడు.

ACB Raids : హైదరాబాద్ లో ఇరిగేషన్ ఏఈ నిఖేశ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నీటిపారుదల శాఖలో నిఖేశ్ అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణలతో ఏసీబీ ఈ సోదాలు చేసింది. ఏకకాలంలో 30 చోట్ల తనిఖీలు చేశారు అధికారులు. ఈ సోదాల్లో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ నిఖేశ్ 100 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉదయం నుంచి ఏసీబీ అధికారుల తనిఖీలు చేశారు. నిఖేశ్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. నిఖేశ్ కు మూడు ఫామ్ హౌస్ లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ 80 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గతంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన నిఖేశ్.. సస్పెన్షన్ కు గురయ్యాడు.
ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ ఇంజినీర్ గా పని చేస్తున్న నిఖేశ్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏకంగా 30 చోట్ల తనిఖీలు చేశారు. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని నిఖేశ్ పై ఆరోపణలు ఉన్నాయి. అతడికి మూడు ఫామ్ హౌస్ లు ఉన్నట్లు గుర్తించారు.
అలాగే రూ.80 కోట్లపైన ఆస్తులు కలిగున్నట్లు గుర్తించారు. గతంలో లక్ష రూపాయల లంచం తీసుకుంటూ నిఖేశ్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆ కేసులో సస్పెండ్ అయిన అతడు.. మళ్లీ విధుల్లో చేరాడు. అనతి కాలంలోనే పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు గడించినట్లు ఏసీబీ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. నిఖేశ్ కుమార్ ఇళ్లు, కార్యాలయాలు, అతడి బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 30 చోట్ల సోదాలు చేస్తున్నారు.