Formula E Race Case
Formula E Race Case : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో దాన కిశోర్ స్టేట్ మెంట్ ను ఏసీబీ రికార్డ్ చేసింది. 7 గంటల పాటు స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది ఏసీబీ. త్వరలోనే మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్ లకు ఏసీబీ నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దానకిశోర్ స్టేట్ మెంట్ ఆధారంగా ఏసీబీ విచారించనుంది.
కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ?
దానకిశోర్ నుంచి పలు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఈ కార్ రేస్ కేసులో దానకిశోర్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ అయినట్లు వెల్లడించారు. హెచ్ఎండీఏ ద్వారా ఎఫ్ఈవోకు డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు.
Formula E-Car Race Case
ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తో వాంగ్మూలం తీసుకుంది. తన స్టేట్ మెంట్ లో దానకిశోర్ పలు కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్ రేసింగ్ లో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర కీలకంగా ఉందని తెలుస్తోంది. దానకిశోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ లో కూడా ఇదే అంశాన్ని చెప్పినట్లు సమాచారం.
Also Read : అల్లు అర్జున్ జాతకం అప్పటిదాకా బాగోలేదు.. బన్నీ జాతకం చెప్పిన వేణుస్వామి..
నిబంధనలు ఉల్లంఘించి రూ.55 కోట్లు చెల్లింపు..!
అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న దానకిశోర్.. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు విదేశీ కంపెనీకి ఈ కార్ రేస్ వ్యవహారంలో 55 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా ఆర్బీఐ నిబంధనలు, హెచ్ఎండీఏ బోర్డు అనుమతి తీసుకోవడం కానీ, 10 కోట్ల రూపాయల పైచిలుకు బిల్లులు చెల్లించాల్సి వచ్చిన సందర్భంలో ప్రత్యేకంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నిబంధనల ఉల్లంఘనలన్నీ కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే జరిగాయని ఏసీబీకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో దానకిశోర్ వెల్లడించినట్లు సమాచారం.
ఈ కార్ రేస్ కేసులో ప్రధానంగా కేటీఆర్ ను ఏ-1గా, అరవింద్ కుమార్ ను ఏ-2గా ఏసీబీ ఇప్పటికే చేర్చింది. అటు ఈడీ కూడా రంగంలోకి దిగింది. దీనిపై విచారణ వేగవంతం చేస్తే ముందు ముందు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది.
Also Read : మంచిర్యాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్..