Private Hospital Fraud : మంచిర్యాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్..

ఏకంగా 4లక్షల 50వేల రూపాయల బిల్లు వేయడంతో రోగి బంధువులు షాక్ కి గురయ్యారు.

Private Hospital Fraud : మంచిర్యాల జిల్లాలో దారుణం.. ప్రైవేట్ ఆసుపత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్..

Updated On : December 25, 2024 / 4:55 PM IST

Private Hospital Fraud : మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెస్ట్ పెయిన్ తో నిన్న రాత్రి కొంగ శ్రీనివాస్ అనే వ్యక్తి టచ్ ఆసుపత్రిలో చేరాడు. చికిత్స కోసం మొదట లక్ష 50వేల రూపాయలు చెల్లించారు. దాని తర్వాత 40 నిమిషాలకే శ్రీనివాస్ మరణించాడంటూ టచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. అంతే కాకుండా డెడ్ బాడీ తీసుకెళ్లాలంటే మరో 4 లక్షల 50వేలు చెల్లించాలంటూ ఆసుపత్రి వైద్యులు చెప్పారు. చనిపోయిన వ్యక్తికి వైద్యం ఎలా చేస్తారంటూ మృతుడి బంధువులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు.

ఠాగూర్ సినిమాలోని ఆసుపత్రి సీన్ గుర్తింది కదూ. ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లు చనిపోయిన వ్యక్తికి సైతం చికిత్స చేసినట్లు నటించి లక్షల రూపాయల బిల్లు వసూలు చేస్తారు. సరిగ్గా ఇదే తరహా సీన్ మంచిర్యాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో వెలుగుచూసింది. టచ్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రోగి చనిపోయినా ఆ విషయం చెప్పకుండా.. డెడ్ బాడీకి చికిత్స చేసినట్లు నటించి లక్షల రూపాయల బిల్లు వేశారు. ఏకంగా 4లక్షల 50వేల రూపాయల బిల్లు వేయడంతో రోగి బంధువులు షాక్ కి గురయ్యారు.

కాగా, టచ్ ఆసుపత్రికి సంబంధించి గతంలోనూ చాలా ఆరోపణలు ఉన్నాయి. మృతదేహాలకు ట్రీట్ మెంట్ చేశామని రోగి బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న తంతు ఈ టచ్ ఆసుపత్రిలో కొనసాగుతోంది. నిన్న రాత్రి కాగజ్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి.. చెస్ట్ పెయిన్ తో టచ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్య చికిత్సకు లక్ష 80 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు అవుతుందని ముందుగానే పేషెంట్ బంధువులతో మాట్లాడుకున్నారు. దీంతో అడ్వాన్స్ గా లక్ష 50వేలు చెల్లించుకున్నారు.

Also Read : ఏదో కుట్ర పన్నాడు.. అందుకే చంపేశాడు: పార్సెల్‌లో డెడ్ బాడీ కేసు.. మృతుడి భార్య ఈశ్వరీ కీలక కామెంట్స్‌

ఆ తర్వాత 45 నిమిషాలకే.. పేషెంట్ చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. రేపు పొద్దున వచ్చి డెడ్ బాడీ తీసుకెళ్లాలని మృతుడి బంధువులతో చెప్పారు. ఈ ఉదయం డెడ్ బాడీ కోసం బంధువులు ఆసుపత్రికి వెళ్లారు. అయితే, వారికి షాకింగ్ విషయం చెప్పింది ఆసుపత్రి యాజమాన్యం. ట్రీట్ మెంట్ కు గాను ఇంకా 4 లక్షల 50వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేసింది. శ్రీనివాస్ కు చికిత్స అందించామని దానికి సంబంధించి ఫీజు చెల్లించాలన్నారు. ఆ తర్వాత డెడ్ బాడీ తీసుకెళ్లాలని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. దాంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు షాక్ కి గురయ్యారు.

Private Hospital Fraud For Money

డెడ్ బాడీకి ట్రీట్ మెంట్ చేయడం ఏంటి? అని బంధువులు మండిపడుతున్నారు. ఆసుపత్రి సిబ్బంది వైఖరికి నిరసనగా ఆందోళనకు దిగారు. టచ్ ఆసుపత్రి తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాగా, గతంలోనూ ఈ ఆసుపత్రిలో ఈ తరహా ఘటన జరిగిందని చెబుతున్నారు. గత నెల 6న ఓ మహిళ చనిపోయిన తర్వాత ట్రీట్ మెంట్ చేశామని చెప్పారని, డబ్బులు ఇస్తే కానీ మృతదేహాన్ని ఇచ్చేది లేదని టచ్ ఆసుపత్రి యాజమాన్యం చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయి.

టచ్ ఆసుపత్రి యాజమాన్యం చాలా కమర్షియల్ గా వ్యవహరిస్తోందని జనాలు మండిపడుతున్నారు. పేషెంట్లు చనిపోయిన తర్వాత కూడా ట్రీట్ మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టచ్ ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గతంలో జిల్లా కలెక్టర్ కి, డీఎంహెచ్ వోకి ఫిర్యాదు చేసినప్పటికీ.. వారు పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. టచ్ ఆసుపత్రిలో అసలేం జరగుతోంది? అనేదానిపై పూర్తి స్థాయిలో దర్యాఫ్తు జరపాలనే డిమాండ్ వినిపిస్తోంది.

 

Also Read : 67 మందితో వెళ్తూ కుప్పకూలిన విమానం.. వీడియో చూశారా?