Hyderabad: ఖాజాగూడ చెరువు రోడ్డు వద్ద బోల్తా పడ్డ కారు.. ఒకరి మృతి

ట్రాఫిక్‌ రద్దీ పరిష్కారం కోసం ఖాజాగూడ సర్కిల్‌ వద్ద ఇటీవలే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై..

car Accident

Car Accident: హైదరాబాద్‌లోని ఖాజాగూడ చెరువు రెడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అధిక వేగంతో వెళ్తూ ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులోని ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ ప్రాంతంలో గంటకు 40 కిలోమీటర్ల కంటే అధిక వేగంతో వెళ్లకూడదన్న నిబంధన ఉంది.

నిబంధనలు పాటించకుండా కారును అధిక వేగంతో నడిపించినందుకే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, ట్రాఫిక్‌ రద్దీ పరిష్కారం కోసం ఖాజాగూడ సర్కిల్‌ వద్ద ఇటీవలే సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు పలు నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. పోలీసుల ఆంక్షలతో ఓ రూట్లో వెళ్లేవారికి లబ్ధి చేకూరుతోంది. మరి కొందరికి మాత్రం ఇబ్బందికరంగా మారింది.

కాగా, హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. అందుకు అతి వేగంతో పాటు పాత వాహనాలు కూడా కారణమవుతున్నాయి. ఫిట్‌నెస్‌ సరిగా లేకపోయినా పాత వాహనాలకు నడిపిస్తున్నారు చాలామంది. పదేళ్లు దాటిన వాహనాల్లో ఆయిల్‌ కారడంతో పాటు బ్రేకులు, క్లచ్‌లు సరిగ్గా పని చేయవు. తరుచూ వాహనాల్లో అటువంటి సమస్యలు కనపడుతున్నా నిర్లక్ష్యంగా వాటినే నడిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల వల్ల డ్రైవర్లు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Italy : ఒకే రోజు.. వేర్వేరు విమాన ప్రమాదాలు.. మృత్యువును జయించిన జంట