N convention: సవినయంగా అభ్యర్థిస్తున్నాను అంటూ మరోసారి హీరో నాగార్జున కామెంట్స్

అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు..

Nagarjuna

హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున ఎక్స్ ఖాతాలో మరోసారి స్పందించారు. ‘‘ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఎన్-కన్వెన్షన్‌కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి .

కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని Special Court, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇచ్చింది.

ప్రస్తుతం, నిర్మాణ చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం హైకోర్టుని ఆశ్రయించాం. న్యాయస్థాన తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్థిస్తున్నాను’’ అని అక్కినేని నాగార్జున చెప్పారు. అక్కినేని నాగచైతన్య కూడా ఈ ట్వీట్ ను రీట్వీట్ చేశారు.

కాగా, ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతపై సీపీఐ నారాయణ సహా పలువురు ప్రముఖులు స్పందించి నాగార్జునపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలకు ఉపక్రమించింది.

Dear all,

 

Also Read: ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున ‘బిగ్ బాస్’కే బాస్.. ఆ డబ్బంతా ప్రభుత్వం కక్కించాలి: సీపీఐ నారాయణ