అరుదైన జననం : పుడుతూనే పెద్ద తలతో శిశువు

  • Publish Date - October 27, 2020 / 08:47 AM IST

Baby born with big head : ఆదిలాబాద్‌లోని భీంపూర్ మండలంలోని కరంజి(టి) పంచాయతీ పరిధిలోని రాజుల్ వాడీ గ్రామానికి చెందిన సువర్ణ అనే గర్భణికి పెద్ద తలతో ఉన్న శిశువును జన్మచ్చింది. సువర్ణ సోమవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ హాస్పిటల్ లో మధ్యాహ్నం 3 గంటలకు పెద్ద తలతో ఉన్న పాప పుట్టింది. ఆ పాపను మెరుగైన చికిత్స కోసం వెంటనే హైదరాబాద్‌లోని నిలోఫర్‌ హాస్పిటల్ కు తరలించారు.


సాధారణంగా నవజాత శిశువు తల 33-36 సెంటీమీటర్లుతో జన్మిస్తారు. కానీ ఈ పాప తల అంతకుమించి ఉన్నదని వైద్యులు తెలిపారు. సువర్ణ అనే మహిళకు ఐదోనెల స్కానింగ్‌ పరీక్షల్లో శిశువు తల పెద్దదిగా ఉన్నదని, ఆపరేషన్‌ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పినా ఆమె వినిపించుకోలేదని భీంపూర్‌ పీహెచ్‌సీ పరిధి కరంజి(టి) గ్రామానికి చెందిన ఉపకేంద్ర ఆశ కార్యకర్త శశికళ, ఏఎన్‌ఎం సుజాత తెలిపారు.


గతంలోనూ ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఐదో నెలలో స్కానింగ్‌ చేయిస్తే.. అప్పుడు శిశువు తల పెద్దదిగా ఉందని వైద్యులు చెప్పారు. అప్పుడు ఆమెను ఒప్పించి రిమ్స్‌లో అబార్షన్‌ చేయించినట్లు వారు పేర్కొన్నారు.



https://10tv.in/khap-panchayat-orders-social-boycott-of-elderly-man-for-12-years/
సాధారణంగా ఈ లక్షణాలతో ఉంటే హైడ్రోసెప్లస్‌ (తలలో నీళ్లు నిండి ఉండటం వల్లఇలా పెద్దదిగా ఉండటం)గా భావించవచ్చని, క్రోమోజోముల సమస్య, మేనరికాలతో కూడా ఇలా జరుగవచ్చున్నని వైద్యులు చెబుతున్నారు. ఇలా పెద్ద తలతో జన్మించిన శిశువు కేసులు 15 సంవత్సరాల క్రితం నమోదయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. అయితే న్యూరోసోనోగ్రామ్‌ వంటి తదితర పరీక్షల తర్వాతే ఆపాప ఆరోగ్యం పై పూర్తి వివరణ ఇవ్వగలుగుతామని వైద్యాధికారులు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు