Adulterated Ice-cream : వామ్మో.. ఈ ఐస్‌క్రీమ్ తింటే చావే..! పోలీసుల రైడ్‌లో షాకింగ్ విషయాలు, గ్రామీణ ప్రాంతాలే టార్గెట్

Adulterated Ice-cream : ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మరీ మార్కెట్ లో అమ్మేస్తున్నారు.

Adulterated Ice-cream

Adulterated Ice-cream – Katedan : రంగారెడ్డి జిల్లా కాటేదాన్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. ప్రమాదకర రసాయనాలతో కల్తీ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఆకర్షణీయమైన లేబుల్స్ అతికించి మరీ మార్కెట్ లో అమ్మేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాలను టార్గెట్ చేసి ఐస్ క్రీమ్ లు విక్రయిస్తున్నారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఫుడ్ సేఫ్టీ, ట్రేడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్.. ఇవేవీ లేకుండానే దర్జాగా పరిశ్రమను నిర్వహిస్తున్నారు. ఐస్ క్రీమ్ తయారీ పరిశ్రమపై దాడి చేసిన పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడిని మైలార్ దేవ్ పల్లి పోలీసులకు అప్పగించారు ఎస్వోటీ పోలీసులు.

Also Read..Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!

ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేదు. అంతా ఐస్ క్రీమ్ లవర్సే. ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు టేస్ట్ చేయకుండా వదలరు. అయితే, ఐస్ క్రీమ్ లవర్స్ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. కోరిమరీ జబ్బులు కొని తెచ్చుకున్నట్లే.

మీరు తింటున్న ఐస్ క్రీమ్ ఒరిజినలో లేక కల్తీదో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే, మార్కెట్ లో నకిలీ, కల్తీ ఐస్ క్రీమ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నాసిరకమైనవి, హానికారక విష రసాయనాలతో చేసినవి, కలుషిత వాతావరణంలో చేసినవి.. మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ దందాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ముఠాలు పట్టుబడుతున్నాయి.

తెలంగాణలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ దందా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ లు తయారు చేసి వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఐస్ క్రీమ్ లు కొని తిన్నవారు అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ ఐస్ క్రీమ్ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సిందే. లేకపోతే ఆరోగ్యానికి శాపంగా మారే ప్రమాదం ఉంది.

Also Read..Eating Dinner Early : రాత్రి భోజనం త్వరగా ముగించటం వల్ల బరువు తగ్గటం, నిద్రబాగా పట్టటంతోపాటు అనేక ప్రయోజనాలు !

ఐస్ క్రీమ్స్ తయారీలో కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆకర్షణీయంగా ఉండి మిలమిల మెరిసేందుకు మెటల్ అదే విధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ మెటీరియల్ వాడుతున్నట్లుగా గుర్తించారు. ఈ రెండూ.. రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలో తేలింది.