Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!

మద్యం అలవాటు ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది జబ్బు పడుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ నివేదిక బయటపెట్టింది. మహిళలు కూడా ఈ మధ్య కాలంలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు.

Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!

alcohol consumption increases risk of 61 diseases

Drinking Alcohol- alcohol consumption: పార్టీ లేదా పుష్పా (party leda pushpa) అంటూ సంబరాలు చేసుకునే బ్యాచ్‌కు బ్యాడ్‌న్యూస్ (Bad News) ఇది. బరాబర్ దావత్‌ (Dawat)లతో బిజీబిజీగా గడిపే మందుబాబులు గుండె గుభేల్‌మనే హెచ్చరిక. మందేసి మరో ప్రపంచంలో విహరించేవారు.. ఈ ప్రపంచంలో ఉన్న చాలా రోగాలకు దగ్గరవుతున్నట్లు తాజా అధ్యయనం(Latest Study)లో వెల్లడైంది. ప్రాణాంతకమైన వ్యాధుల్లో 60 రోగాలకు మందేయడమే ప్రధాన కారణంగా చెబుతూ ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్శిటీ (Peking University) పరిశోధకులు ఓ నివేదిక విడుదల చేశారు. మందేస్తే అంతే సంగతులను హెచ్చరిస్తున్నారు.

60 రకాల ప్రాణాంతక వ్యాధులకు ఆల్కహాలే కారణం
ఆల్కహాల్ వినియోగం చాలా ప్రమాదకరం.. ఈ విషయం చాలా మందికి తెలిసినా.. సీసా కనిపిస్తే ఆగలేనంత బలహీనత. మందు వాసన చూస్తే నోరు చప్పరించే మహానుభావులే ఎక్కువ. ఏటా పెరుగుతున్న మద్యం వినియోగం చూస్తే.. మన జీవితాల్లో మద్యానికి బానిసవుతున్న వారి సంఖ్య ఎంతగా పెరుగుతుందో తెలిసిపోతోంది. అయితే ఇలాంటి వారందరూ చాలా డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్ అనే సంస్థ ఓ నివేదికలో హెచ్చరించింది. చైనాలోని పెకింగ్ యూనివర్సిటీతో కలిసి ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ సంస్థ జరిపిన అధ్యయనంలో సుమారు 60 ప్రాణాంతక వ్యాధులకు మద్యపానమే మూల కారణంగా తేలింది. 200 రోగాలతో బాధపడుతున్న వారిని పరిశీలించగా.. అందులో 60 రోగాలకు కేవలం మద్యపానం ఒక్కటే కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. మద్యం విక్రయించే సంస్థలే హెచ్చరించే నినాదమిది. కానీ ఏ ఒక్కరూ వెనక్కి తగ్గరు. మద్యానికి ఉన్న మహత్యం అలాంటిది. కానీ, ఈ రిపోర్టు చూస్తే ఇక మందు వేయడానికి ఆలోచిస్తారు. ఎందుకంటే లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, బీపీ వంటి జబ్బులతోపాటు జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ నివేదిక తేల్చింది. మన వైద్యులు ఇదే విషయం చెప్పినా ఎవరు వింటున్నారు? అందుకే ఆ సంస్థ గణాంకాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా మద్యం వల్ల వచ్చే వ్యాధుల చిట్టా ఒకటి తయారు చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది మృతి
మద్యపానం వల్ల ఏటా ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది మరణిస్తున్నారు. మన దేశంతోపాటు, చైనా వంటి జనాభా అధికంగా ఉన్న దేశాల్లోనే ఈ మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. వ్యాధులు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. చిన్నవయసు వారు.. మహిళలు కూడా ఈ మధ్య కాలంలో మద్యపానానికి అలవాటు పడుతున్నారు. 21 సంవత్సరాల వయసులోపు వారికి మద్యం విక్రయాలు నిషేధమైనా.. ఆ నిబంధన ఎక్కడా పాటించడం లేదు. దీంతో చాలా మంది చిన్నోళ్లు ఈ దురలవాటుకు లోనవుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. మద్యపానం వల్ల శారీరక ఆరోగ్యమే కాదు.. మానసికంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు వైద్యులు.

Also Read: ఇండియాకు గుడ్ బై చెబుతున్న కుబేరులు.. ఇబ్బంది లేదంటున్న ఆర్థిక నిపుణులు.. ఎందుకంటే?

మద్యం అలవాటు ఉన్న పురుషుల్లో మూడింట ఒక వంతు మంది జబ్బు పడుతున్నట్లు ఆక్స్‌ఫర్డ్ నివేదిక బయటపెట్టింది. సుమారు ఐదు లక్షల మందిని ప్రశ్నించి వారి అనారోగ్యానికి గల కారణాలపై అధ్యయనం చేస్తే సంచలన విషయాలు వెలుగుచూశాయి. లివర్ సిర్రోసిస్, స్ట్రోక్, జీర్ణాశయ క్యాన్సర్‌ వంటి 28 రకాల ప్రాణాంతక వ్యాధులు, గౌట్, అంధత్వం, గ్యాస్ట్రిక్ వంటి 33 దీర్ఘకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆ అధ్యయనంలో తేలింది.

Also Read: చైనా యువత కొత్త ధోరణి..! అధిక జీతం వచ్చే ఉద్యోగాలను వదులుకొని వెయిటర్లుగా ఎందుకు మారుతున్నారు?

మద్యపానం వల్ల ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఎదుర్కొనే వారిలో ఎక్కువ మంది నిత్యం అదేపనిగా డ్రింక్ చేసేవారే ఎక్కువ. అప్పుడప్పుడు మద్యం తాగే అలవాటు ఉన్నవారు కూడా ఈ దురాలవాటుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.

ఒక్క పెగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే మహా ముప్పు.. వివరాలకు ఈ వీడియో చూడండి..