Chikkudu Prabhakar : కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ వంతెనపై హైకోర్టు సీజేకు లాయర్ చిక్కుడు ప్రభాకర్ లేఖ

బ్యారేజీలో నీరు వరదలా వచ్చి ములుగు, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మునిగిపోయి పరిస్థితి ఉందని తెలిపారు. భారీ వరదల కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

lawyer Prabhakar

Chikkudu Prabhakar Lettered High Court : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయి ప్రమాదకర దశలో ఉందని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. బ్యారేజీకి ఏదైనా నష్టం జరిగితే మూడు జిల్లాలకు ప్రమాదమని తెలిపారు.

బ్యారేజీలో నీరు వరదలా వచ్చి ములుగు, భద్రాద్రి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు మునిగిపోయి పరిస్థితి ఉందని తెలిపారు. భారీ వరదల కారణంగా ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉందని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ చిక్కుడు ప్రభాకర్ కోర్టును కోరారు. ఈ లేఖను పిల్ గా స్వీకరించి విచారణ చేపట్టాలని చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేశారు.

Kaleshwaram Medigadda Lakshmi Barrage : కుంగిన కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన.. తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు బంద్

కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వంతెన కుంగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయాయి. 15వ నెంబర్ పిల్లర్ నుంచి 20వ నెంబర్ పిల్లర్ వరకు వంతెన కుంగినట్లు అధికారులు తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ లోని నీటిని ఖాళీ చేయిస్తున్నారు. అధికారులు డ్యామ్ 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారుల అలర్ట్ అయ్యారు. వంతెన కుంగిపోవడంతో లక్ష్మీ బ్యారేజ్ మీదుగా తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేశారు. వంతెన కుంగిపోయిన విషయంలో సంఘ విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.