Site icon 10TV Telugu

18ఏళ్లు నిండిన రైతులకు ఛాన్స్.. 5లక్షలు వచ్చే పథకంకోసం దరఖాస్తుకు మరో రెండ్రోజులే సమయం.. వెంటనే ఈ పత్రాలతో అప్లై చేసుకోండి..

AP Farmers

AP Farmers

Rythu Bhima: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రైతులకోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తోంది. రైతు భరోసా, రైతు బీమా, రుణమాఫీ తదితర పథకాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో రైతు భరోసా నిధులు విడుదల చేసింది. తాజాగా. ఈ ఏడాది రైతు బీమా పథకం అమలు కోసం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2018 ఆగస్టు 14న ప్రారంభించింది. ఈ పథకం కింద నమోదు చేసుకున్న రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే అతని కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు మరణమైనా ఈ పథకం వర్తిస్తుంది. ఈ ఏడాది 2025-26 బీమా సంవత్సరం ఈనెల 14 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకున్న వారిపేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్ లో నమోదు చేస్తారు.

రైతు బీమా పథకంలో భాగంగా జూన్ 5వ తేదీ నాటికి పట్టా పాస్‌బుక్ జారీ అయినప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమా దరఖాస్తు చేసుకోని రైతులకు మరో అవకాశం కల్పించింది. కొత్తగా పాస్‌బుక్‌లు వచ్చిన రైతులు మాత్రమే ఈ రైతు బీమా దరఖాస్తు చేసుకోవాలని, ఇందుకు దరఖాస్తు ఫారం, రైతు పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్‌తో డిజిటల్ సంతకం అయిన డీఎస్ పేపర్, రైతు ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ ఆధార్ కార్డు తదితర వివరాలను సంబంధిత ఏఈవోలకు సమర్పించాలని వ్యవసాయశాఖ తెలిపింది.

జూన్ 5వ తేదీలోపు పాస్‌బుక్ వచ్చిన రైతులు 1966 ఆగస్టు 14వ తేదీ నుంచి 2007 ఆగస్టు 14వ తేదీ మధ్యలో పుట్టి.. 18 సంవత్సరాలు నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవచ్చునని వ్యవసాయశాఖ నోటిఫికేషన్ లో పేర్కొంది.

కొత్తగా పాస్‌బుక్ పొందిన రైతులతోపాటు.. గతంలో పట్టాదారు పాస్‌బుక్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోని రైతులుకూడా ప్రస్తుతం రైతు బీమా పథకంకు దరఖాస్తు చేసుకోవచ్చునని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

Exit mobile version