Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసును హెచ్చరిస్తున్న వీడియో వైరల్.. కేసు నమోదు.. బీజేపీ నేతల రియాక్షన్

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.. తన సోదరుడిని ర్యాలీలో మాట్లాడకుండా ఎందుకు అడ్డుకున్నారో దానిపై విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేశారు.

Akbaruddin Owaisi

Telangana Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు పాత బస్తీలో ఏఐఎంఐఎం నేతలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మంగళవారం రాత్రి ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదద్దీన్ ఓవైసీ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ లలితాబాగ్ లో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారంలో భాగంగా అక్బరుద్దీన్ ఓ పోలీస్ అధికారిని హెచ్చరించినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. ఈ మేరకు  సంతోష్ నగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రాత్రి 10గంటలకు వరకు ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది.. ప్రచార ముగింపు సమయం దగ్గర పడుతున్న క్రమంలో స్థానిక పోలీస్ అధికారి ఎన్నికల ప్రసంగాన్ని ముగించాలని కోరాడు. దీంతో అక్బరుద్దీన్ సదరు పోలీసులపై బెదిరింపులకు పాల్పడినట్లుగా వీడియో వైరల్ అయింది.

Also Read : Revanth Reddy : కామారెడ్డికే కాదు శంకరగిరి మాన్యాలకు పోయినా కేసీఆర్‌ ఓటమి ఖాయం- రేవంత్ రెడ్డి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇన్ స్పెక్టర్ సాబ్.. నా దగ్గర వాచ్ ఉంది.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ సభావేదిక వద్ద ఉన్న పోలీస్ అధికారికి అక్బరుద్దీన్ సూచించారు. తనను మాట్లాడకుండా ఎవరూ ఆపలేరు. ఒక్క సిగ్నల్ ఇస్తే పోలీసు అధికారిని పరుగు పెట్టిస్తారు అంటూ అక్బరుద్దీన్ వ్యాఖ్యానించినట్లు గా ఉంది. కత్తులు, బెల్లెట్లు ఎదుర్కొంటే నేను బలహీనుడయ్యాను అనుకుంటున్నారా? నాలో చాలా ధైర్యం ఉంది. ఐదు నిమిషాలు మిగిలి ఉన్నాయి.. ఐదు నిమిషాలు నా ప్రసంగం కొనసాగుతుంది. నన్ను ఎవరూ ఆపలేరు.. అంటూ అక్బరుద్దిన్ అన్నాడు.

Also Read : Telangana Elections 2023: తుమ్మల ప్రసంగిస్తుండగా వచ్చిన పువ్వాడ అజయ్.. హోరెత్తిన నినాదాలు.. వీడియో వైరల్

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆయన సోదరుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.. తన సోదరుడిని ర్యాలీలో మాట్లాడకుండా ఎందుకు అడ్డుకున్నారో దానిపై విచారణ చేపట్టాలని ఈసీని డిమాండ్ చేశారు. ఇంకా ఐదు నిమిషాలు సమయం ఉన్నా.. పోలీసులు వేదికపైకి ఎక్కి సమావేశాన్ని ఆపమని అడగడంపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అసదుద్దీన్ అన్నాడు. ఈ ఘటనపై తెలంగాణ బీజేపీ రియాక్ట్ అయింది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అక్బరుద్దీన్ ఒవైసీపై బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని పేర్కొంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుతో ఏఐఎంఐఎం పాత బస్తీని అభివృద్ధి జరగకుండా అడ్డుకోవటంతో పాటు నేరపూరితమైన ప్రాంతంగా మార్చేసిందని తెలంగాణ బీజేపీ పేర్కొంది.

 

 

ట్రెండింగ్ వార్తలు