Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.

Hyderabad Traffic Restrictions : న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2గంటల వరకు ఆంక్షలు విధించారు.

ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పైకి వాహనాలకు అనుమతి లేదన్నారు పోలీసులు. రేపు నగరంలో కొన్ని ఆంక్షలు కొనసాగనున్నాయి. రేపు నగరంలో తనిఖీలు చేస్తామన్నారు పోలీసులు. కొత్త ఏడాది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

Also Read..Hyderabad Pubs : న్యూఇయర్‌ సెలబ్రేషన్స్ వేళ హైదరాబాద్ పబ్‌లకు హైకోర్టు షాక్‌

* ట్రాఫిక్‌ ఆంక్షల సమయంలో ఎన్టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వాహనాలను అనుమతించరు.
* ఖైరతాబాద్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్, ఎన్టీఆర్‌ మార్గ్‌ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్‌, రాజ్‌భవన్‌ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు.
* లిబర్టీ కూడలి, అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లే వాహనాలను అంబేద్కర్‌ విగ్రహం వద్ద దారి మళ్లిస్తారు.
* హుస్సేన్ సాగ‌ర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయి.
* మింట్‌ కాంపౌండ్‌ రోడ్డును మూసివేయనున్నారు.
* నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి మీదుగా సంజీవయ్య పార్కు వైపు వెళ్లే వాహనాలను రాణిగంజ్‌ మీదుగా మళ్లిస్తారు.
* సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లే వాహనాలను కవాడిగూడ కూడలి, లోయర్‌ ట్యాంక్‌బండ్‌ కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లించనున్నారు.

కొన్ని గంటల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. అప్పుడే హంగామా నెలకొంది. అంతా సెలబ్రేషన్స్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

Also Read..Hyderabad Drugs : బాబోయ్.. హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, ఏకంగా రూ.50 కోట్ల విలువైన డ్రగ్ స్వాధీనం

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌కు హైద‌రాబాద్ న‌గ‌రం సిద్ధ‌మ‌వుతోంది. కాగా, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌నలు జరక్కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఇందులో భాగంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.(Hyderabad Traffic Restrictions)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

హైద‌రాబాద్ వ్యాప్తంగా ఉన్న అన్ని ఫ్లైఓవ‌ర్ల‌ను మూసివేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. బేగంపేట్, లంగ‌ర్ హౌజ్ ఫ్లైఓవ‌ర్లు మాత్రం తెరిచి ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు. మరోవైపు ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై డిసెంబర్‌ 31 రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలతో పాటు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని సీపీ సీవీ ఆనంద్‌ కోరారు.

ట్రెండింగ్ వార్తలు