Parshottam Rupala (Photo : Google)
Parshottam Rupala – PM Modi : 9ఏళ్ల ప్రధాని మోడీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని కేంద్ర పశు సంవర్థ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. ఆకాంక్ష జిల్లాల పథకం ద్వార దేశంలోని వెనకబడ్డ జిల్లాలు డెవలప్ అయ్యాయని చెప్పారు. ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు ఇవ్వడంతో దేశ ప్రజలు అమలు చేశారని వ్యాఖ్యానించారు. గ్రామ పంచాయతీలకు నేరుగా 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని రూపాల పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో బీజేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాజన్ సంపర్క్ అభియాన్ బహిరంగ సభలో కేంద్ర పశు సంవర్థ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర గౌడ్, మాజీమంత్రి బాబూమోహన్ పాల్గొన్నారు.
”2014 సంవత్సరం వరకు కేవలం 6వేల గ్రామ పంచాయతీలకు భవనాలు ఉండగా, తర్వాత 30వేల గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించారు. జన్ ధన్ అకౌంట్ వల్ల కొత్తగా 49కోట్ల అకౌంట్లు తెరిచారు. ఇందులో 37 కోట్ల అకౌంట్లను మహిళలు తెరిచి, వీటిలో 2 లక్షల కోట్ల రూపాయలను జమ చేశారు. ఇది సంచలనం సృష్టించింది.
ప్రధాని మోడీ విదేశీ పర్యటనలో యోగ దివస్ రోజు ప్రపంచానికి దేశ ఔన్నత్యాన్ని చాటడానికి అమెరికాలో యోగ చేయనున్నారు. గుజరాత్ లో వచ్చిన బిపర్ జాయ్ తుఫాన్ తో సముద్ర సమీప ప్రజలకు ఎలాంటి ప్రాణహాని జరక్కుండా రెస్క్యూ టీమ్ లను ఏర్పాటు చేసిన ఘనత మోడీ సర్కార్ దే” అని కేంద్రమంత్రి రూపాల అన్నారు.
Also Read..Drinking Alcohol: దావత్‌లో బిజీగా ఉన్నారా.. అయితే జాగ్రత్త.. మందేస్తే అంతే సంగతులు!