Etela Rajender : ఈటలపై భూ దందా ఆరోపణలు..సీఎం కేసీఆర్ సీరియస్

మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూ దందా ఆరోపణలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు.

CM KCR Serious : మంత్రి ఈటల రాజేందర్ పై వస్తున్న భూ దందా ఆరోపణలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎస్. విజిలెన్స్ డీజీకి ఆయన ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పై భూ దందా ఆరోపణలు వస్తుండడం కలకలం రేపుతోంది. మూసాయి పేట మండలానికి చెందిన రైతులు ఏకంగా సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల, ఆయన అనుచరులు తమను భయపెట్టి..వందలాది ఎకరాలను భూ కబ్జా చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ అసైన్డ్ భూములని, తమకు ఎప్పుడో కేటాయించారని వారు చెబుతున్నారు.

దీంతో సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. వెంటనే విచారణకు ఆయన ఆదేశించారు. సమగ్ర విచారణ జరిపించాలని సీఎస్, విజిలెన్స్ డీజికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సమగ్ర నివేదిక అందివ్వాలని సీఎస్..మెదక్ జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. రెండు, మూడు రోజుల్లో సమగ్ర నివేదిక వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు..అసలు ఏం జరిగింది ? తదితర వివరాలు తెలియచెప్పేందుకు మంత్రి ఈటల రెడీ అవుతున్నారు. మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించనున్నారు. ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేయాలని ఈటల ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Read More :  Medak : మెదక్ జిల్లాలో భారీ భూ దందా… మంత్రి ఈటలపై ఆరోపణలు ?

ట్రెండింగ్ వార్తలు