BJLP Leader: బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.. బీజేపీ చీఫ్ విప్‌గా పాల్వాయి హరీశ్

విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుత్తాను బీజేపీ నియమించింది.

బీజేఎల్పీ నేతగా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఎంపిక చేస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అలాగే, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నియమితులయ్యారు. బీజేపీ చీఫ్ విప్‌గా పాల్వాయి హరీశ్, విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుత్తాలను బీజేపీ నియమించింది.

బీజేఎల్పీ ట్రెజరీగా ఆర్ముర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి, బీజేఎల్పీ సెక్రటరీగా రామారావు పటేల్ నియమితులయ్యారు. ఈ మేరకు అధికార పత్రాలను అసెంబ్లీ అధికారులు అందించారు బీజేపీ నేతలు. అధికారిక పత్రాలను అసెంబ్లీకి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు తీసుకవచ్చారు.

హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ రాజా సింగ్‌కు ఆయా హోదాల్లో చోటు దక్కలేదు. గోషామాల్ నుంచి రాజాసింగ్ ముడు సార్లు గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఆయన బీజేపీ ఎల్పీ లీడర్ పదవి వస్తుందని అనుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు రాజా సింగ్ బీజేపీ నుంచి కొన్ని నెలల పాటు సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రాజా సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అప్పట్లో కలకలం రేపాయి.

Read Also: ఎమ్మెల్యే పార్థసారధి టీడీపీలో చేరికకు ముహూర్తం ఫిక్స్.. న్యూజివీడు నుంచి ఎన్నికల బరిలోకి

ట్రెండింగ్ వార్తలు