Job Fair : అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ ఫెయిర్.. గెస్ట్ గా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్..

మంత్రి తలసాని చేతుల మీదుగా జాబ్ ఫెయిర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి జాబ్ ఫెయిర్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు అసోసియేషన్ ని అభినందించారు.

ATA : అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) అమెరికాలోనే కాకుండా ఇక్కడ ఇండియాలో కూడా పలు సేవా కార్యక్రమాలు, పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంది. తాజాగా హైదరాబాద్(Hyderabad) లో సోమవారం నాడు మెగా జాబ్ ఫెయిర్(Job Fair) నిర్వహించింది ఆటా సంస్థ. అమెరికా తెలుగు అసోసియేషన్(America Telugu Association) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్(Talasani Srinivasa Yadav) ముఖ్య అతిథిగా విచ్చేశారు.

మంత్రి తలసాని చేతుల మీదుగా జాబ్ ఫెయిర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి జాబ్ ఫెయిర్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, ఇలాంటివి ఏర్పాటు చేస్తే కచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని తెలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అమెరికా తెలుగు అసోసియేషన్ ని అభినందించారు. జాబ్స్ కోసం వచ్చిన విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ జాబ్ ఫెయిర్ లో అపోలో, మెడ్ ప్లస్, TCS, IDBI బ్యాంక్, SBI కార్డ్స్, బిగ్ బాస్కెట్, MSN.. లాంటి దాదాపు 30 కంపెనీలు పాల్గొన్నాయి. జాబ్స్ కోసం దాదాపు 500 మంది విద్యార్థులు వచ్చారు. ఇందులో వంద మందికి పైగా అక్కడే ఉద్యోగాలు సాధించారు. మరో వందమంది నెక్స్ట్ రౌండ్స్ కి ఆయా కంపెనీల ఆఫీసులకు రమ్మని తెలిపారు.

Music Director Koti : ఆస్ట్రేలియాలో సంగీత దర్శకుడు కోటికి లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు..

ఇక ఈ జాబ్ ఫెయిర్ ని అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఆధ్వర్యంలో జరగగా ఆటా ఇండియన్ టీం లోహిత్ కుమార్, డాక్టర్ సురేందర్ రెడ్డి, సూర్య చంద్రారెడ్డి, అమ్రిత్ ముళ్ళపూడి, జగన్మోహన్ రెడ్డి, జ్యోత్స్న బొబ్బాల, వెంకటేశ్వరరావు.. పలువురు పాల్గొన్నారు. ఇటివంటి జాబ్ ఫెయిర్స్ త్వరలో మరిన్ని నిర్వహిస్తామని, ఏపీలో కూడా త్వరలోనే నిర్వహిస్తామని ప్రకటించారు ఆటా టీం.

ట్రెండింగ్ వార్తలు