Jennifer Larson : బతుకమ్మ ఆడిన అమెరికా అధికారి.. వీడియో చూశారా..?

అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బతుకమ్మను పేర్చి ఆడి ..పాడి సందడి చేసారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Jennifer Larson : బతుకమ్మ పండుగంటే తనకెంతో ఇష్టం అంటున్నారు అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్. బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేసారామె. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి బయటకి వెళ్లాలంటే.. నేను ముందు ఉండాలి.. రానా వైరల్ కామెంట్స్..

భాగ్యనగరంలో బతుకమ్మ సంబరాలతో కన్నులపండుగగా మారింది. ఎటు చూసినా మహిళలు సందడి చేస్తున్నారు. ఈ వేడుకల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ కూడా పాల్గొన్నారు. పూలతో బతుకమ్మను పేర్చి ఆడి, పాడి సందడి చేసారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జెన్నిఫర్ లార్సన్ 2022 లో యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆమె బతుకమ్మ ఆడటం కొత్తేం కాదు. గతేడాది కూడా ఈ వేడుకల్లో సందడి చేసారు.

Siddhu Jonnalagadda : అయ్యప్ప మాలలో డీజే టిల్లు.. కొత్త సినిమా ఓపెనింగ్‌లో వైరల్ అవుతున్న ఫొటోలు..

Jennifer Larson తన ట్విట్టర్ ఖాతాలో బతుకమ్మ సంబరాల వీడియోను షేర్ చేసారు. గతేడాది మొదటిసారి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నానని.. ఈ సంవత్సరం కొత్త కాన్సులేట్‌లో ఈ వేడుక నిర్వహించడం సంతోషంగా ఉందని.. ఈ పూల పండుగ అంటే తనెకెంతో ఇస్టమని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఈ అందమైన తెలంగాణ పండుగను జరుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ తన పోస్ట్‌లో అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు