Kalki 2898 AD : ప్రభాస్ కల్కి బయటకి వెళ్లాలంటే.. నేను ముందు ఉండాలి.. రానా వైరల్ కామెంట్స్..

ప్రభాస్ కల్కి బయటకి వెళ్లాలంటే.. నేను ముందు ఉండాలి, నా సాయం కావాలి అంటూ రానా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Kalki 2898 AD : ప్రభాస్ కల్కి బయటకి వెళ్లాలంటే.. నేను ముందు ఉండాలి.. రానా వైరల్ కామెంట్స్..

Rana Daggubati viral comments on Prabhas Kalki 2898 AD

Updated On : October 18, 2023 / 7:35 PM IST

Kalki 2898 AD : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టిస్తున్న సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమా కల్కి 2898 AD. ఈ సినిమాలో లోక‌నాయ‌కుడు కమల్‌ హాసన్‌ విల‌న్‌గా క‌నిపించ‌నుండ‌గా దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో రానా కూడా కనిపిస్తున్నాడు. దీంతో రానాకి, ఈ సినిమాకి సంబంధం ఏంటని..? అందరిలో సందేహం మొదలైంది. రానా కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడా..? అని కామెంట్స్ వస్తున్నాయి.

కల్కి టైటిల్ గ్లింప్స్ ని అమెరికాలోని ‘కామిక్ కాన్’ వంటి ప్రెస్టీజియస్ స్టేజి పై రిలీజ్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక అక్కడ విషయాలు అన్నిటిని రానా దగ్గరుండి చూసుకున్నాడు. ఇంతకీ రానాకి, కల్కికి ఉన్న సంబంధం ఏంటని రీసెంట్ గా జరిగిన ఒక మూవీ ప్రెస్ మీట్ లో రానాని విలేకర్లు ప్రశ్నించారు. దీనికి రానా బదులిస్తూ.. “చాలానే సంబంధం ఉంది. టాలీవుడ్ లోని ఏ సినిమా అయినా బౌండరీ దాటి బయటకి వెళ్ళాలి అంటే వాళ్ళకి ముందు నేను ఉంటా. వాళ్ళకి కావాల్సిన సహాయం నేను చేస్తా” అంటూ బదులిచ్చాడు.

Also read :Ram Charan : నాన్నని చూసి నేర్చుకున్నాను.. రామ్ చరణ్ కొత్త యాడ్ ఎమోషనల్‌గా..

ఇప్పుడు కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. రానా మాటలు చూస్తుంటే ప్రభాస్ కల్కి సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేసే భాద్యతలు తానే తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో బాహుబలి విషయంలో కూడా రానా ముందు ఉంది మొత్తం నడిపించాడు. నార్త్ లో ఆ సినిమాని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేశాడు. ఇప్పుడు కల్కి విషయంలో కూడా రానా అదే పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది.