Amit Shah: ఒక రోజు ముందుగానే హైదరాబాద్ కు అమిత్ షా.. కీలక భేటీ

బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Amit Shah Hyderabad visit minute to minute schedule in Telugu

Amit Shah – Hyderabad: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణపై (Telangana) బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కమలం పార్టీ జాతీయ నాయకులు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలో పర్యటించనున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్ రానున్నారు.

బీజేపీ తెలంగాణ (BJP Telangana) శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న జరగనున్న విమోచన దినోత్సవానికి ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరుకానున్నారు. అయితే 16నే ఆయన హైదరాబాద్ రానున్నారు. అదేరోజు రాత్రి తెలంగాణ బీజేపీ నాయకులతో ఆయన భేటీ అవుతారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ తరపున చేపట్టాల్సిన కార్యాచరణపై తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది.

మినిట్ టు మినిట్ షెడ్యూల్
16వ తేదీ రాత్రి 7.55 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు
రాత్రి 8.15 గంటలకు హైదరాబాద్ లోని సీఆర్పీఎఫ్ సెక్టార్ ఆఫీసర్స్ మెస్ కు చేరుకుని రాత్రికి బస చేస్తారు

17వ తేదీ ఉదయం 8.35గంటకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకుంటారు
9 గంటల నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ విమోచన ఉత్సవాల్లో పాల్గొంటారు

ఉదయం 11.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరతారు
ఉదయం 11.50 నిమిషాలకు ఢిల్లీకి పయనమవుతారు

Also Read: తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి తలనొప్పిగా మారిన ఆ మూడు స్థానాలు.. చల్లారని టికెట్ల రచ్చ!