హైదరాబాద్ లో అడుగుపెట్టిన షా

  • Publish Date - November 29, 2020 / 11:50 AM IST

Amit Shah landed in Hyderabad : బీజేపీ చీఫ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. 2020, నవంబర్ 29వ తేదీ ఆదివారం ఉదయం 11.30కు బేగంపేటకు చేరుకున్నారు. పార్టీ కీలక నేతలు ఆయనకు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డప్పు, వాయిద్యాలతో షాకు ఘన స్వాగతం పలికారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుకున్నాయి.



ప్రచారానికి ఆదివారం సాయంత్రంతో ఎండ్ కార్డు పడనుంది. ప్రచారానికి గడువు ముగియనుండడంతో… చివరి అస్త్రంగా అమిత్‌షాను రప్పిస్తోంది. బేగంపేట నుంచి ఓల్డ్‌సిటీ వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో రోడ్‌షోలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం నాంపల్లిలో.. ఆ తర్వాత సనత్‌నగర్‌, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారు.



చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలు మోహరించాయి. మధ్యాహ్నం 1.30లకు రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నారు. అక్కడ ఎన్నికలు, పార్టీ పరిస్థితి తదితర వాటిపై ఆరా తీయనున్నారు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ షా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు