Amit Shah supervise
Amit Shah Supervise : తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని శత విధాలా ప్రయత్నిస్తోంది. తెలంగాణ వ్యవహారాలను నేరుగా అమిత్ షా పర్యవేక్షించనున్నారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు రంగం సిద్ధం చేశారు. పోల్ వార్ రూం ఇంచార్జ్ గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంని నియమించారు.
ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్ట్రాటజీ టీం ఏర్పాటు చేసింది. మీడియా స్ట్రాటజీ టీం ఇంచార్జ్ గా జాతీయ నేత శ్వేతను నియామకం అయ్యారు. ఎంపీ ధర్మపురి అర్వింద్, యోగానందకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు. సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, చింతలకు సమన్వయ బాధ్యతలు ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా 22 కమిటీలు వేశారు. ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. జులై 29న తెలంగాణాకు అమిత్ షా రానున్నారు. ఆ లోపు అన్ని వ్యవహారాలు చక్కబెట్టేలా కార్యాచరణ రూపొందించారు.