Ambati Rambabu : చంద్రబాబు తరహాలోనే దత్తపుత్రుడు.. పవన్ ఏదో చేసేస్తాడని మా వాళ్లంతా ఈలలు వేస్తూ..: అంబటి రాంబాబు

చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు.

Ambati Rambabu : చంద్రబాబు తరహాలోనే దత్తపుత్రుడు.. పవన్ ఏదో చేసేస్తాడని మా వాళ్లంతా ఈలలు వేస్తూ..: అంబటి రాంబాబు

Ambati Rambabu (3)

Updated On : July 25, 2023 / 4:19 PM IST

Minister Ambati Rambabu : చంద్రబాబు నాయుడిలో ఉన్న మరో కోణమే అల్లుడు సుద్ధులు పుస్తకం అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సెటైరికల్ గా చంద్రబాబు (Chandrababu) సుద్ధులను లక్ష్మీపార్వతి (Nandamuri Lakshmi Parvathi) పుస్తక రూపంలో పొందుపరిచారని పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకం చదివే ప్రయత్నం చేయాలన్నారు. ఈ పుస్తకం చదివితే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందని చెప్పారు. చంద్రబాబును అత్యంత సన్నిహితంగా చూశారు కాబట్టే లక్ష్మీపార్వతి ఈ పుస్తకం రాశారని పేర్కొన్నారు. లక్ష్మీపార్వతి రచించిన పుస్తకం ‘అల్లుడు సుద్దులు’ పుస్తకావిష్కరణ సభ విజయవాడలో జరిగింది. ఈ సభలో అంబటి మాట్లాడారు.

ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కోవడానికి చంద్రబాబు చాలా దుర్మార్గాలు చేశాడని ఆరోపించారు. చంద్రబాబు లక్ష్మీపార్వతి భుజంపై తుపాకీ పెట్టి ఎన్టీఆర్ ను కాల్చారని విమర్శించారు. చంద్రబాబు పూర్తి నిజస్వరూపం తెలిసిన వాళ్లెవరూ మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబుపై అత్త, తోడల్లుడే పుస్తకాలు రాయడం చిత్రంగా ఉందని తెలిపారు. మోసం చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

konaseema ycp: బోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా.. ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారో?

ఎన్టీఆర్ భోళాశంకరుడని అభిర్ణించారు. కుట్రలు, కుతంత్రాలు తెలియని వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఓటర్లతో నేరుగా కనెక్షన్ కలిగిన నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్, వైఎస్ జగన్ మాత్రమేనని.. ఇలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారని వెల్లడించారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని విమర్శించారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీని కాంగ్రెస్ తో జత కట్టింటిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.

చంద్రబాబు తరహాలోనే ఇప్పుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ తయారయ్యాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు రాజకీయాలు చేస్తే.. తనకు బదులు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ పని చేస్తున్నాడని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో ఒక్క వైసీపీతో తప్ప అన్ని పార్టీలతోనూ పవన్ పొత్తు పెట్టుకున్నాడని చెప్పారు. కొత్త రాజకీయ ఒరవడి సృష్టించడానికి జగన్ మోహన్ రెడ్డి నాంది పలికారని తెలిపారు.

AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి సాంప్రదాయేతర రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ఆఫీసులకు రహస్య మార్గాలు తవ్వే సొరంగ కార్మికుడు నాదెండ్ల మనోహర్ అని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి గర్జిస్తేనే లోకేష్ లాగు తడుపుకుంటాడని ఎద్దేవా చేశారు.

టీడీపీకి పట్టిన శని లోకేష్ అని మండిపడ్డారు. లోకేష్ వల్ల టీడీపీ గంగలో కలిసిపోతుందన్నారు. లోకేష్ కు ఏదోరకంగా ప్యాంటూ షర్ట్ వేసి కిరీటం పెట్టాలని చూస్తున్నారని వెల్లడించారు. తన కొడుకును సీఎం చేయాలనే తాపత్రయంలో చంద్రబాబు సర్వం కోల్పోతున్నాడని విమర్శించారు.  జగన్ మోహన్ రెడ్డి స్ట్రైట్ పొలిటీషయన్ అని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టడం తన వల్ల కాదని చంద్రబాబుకు కూడా తెలుసన్నారు.

High Court : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. వనమాపై అనర్హత వేటు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించిన ధర్మాసనం

చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ను చూస్తే జాలేస్తోందన్నారు. చంద్రబాబు ట్రాప్ లో పడి పవన్ ఎటూ కాకుండా పోతాడనేదే తన బాధ అన్నారు. పవన్ ఏదో చేసేస్తాడని పాపం తమ కులపోళ్లంతా ఈలలు వేస్తూ గోలలు చేస్తున్నారని చెప్పారు. అల్లుడు సుద్ధులు పుస్తకాన్ని పవన్ కు పార్శిల్ చేయమని లక్ష్మీపార్వతిని కోరుతున్నానని తెలిపారు. ఈ పుస్తకం చదివి పవన్ జ్ఞానోదయం పొందాలని కోరుతున్నానని చెప్పారు. చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకోవాలని పవన్ కు సూచిస్తున్నాని పేర్కొన్నారు.