AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

AP Rains

Heavy Rain Forecast : ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. మంగళవారం, బుధవారం పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతం ఆవర్తన ప్రభావంతో మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

బుధవారం నాటికి వాయుగుండం బలపడి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, ఎన్ టీ ఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Telangana Rain Alert : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రెండు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

అల్లూరి సీతారామరాజు ఏలూరు, కృష్ణా, ఎన్ టి ఆర్ జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని సముద్రంలోకి వదిలారు.

ఇరు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ నుంచి లక్ష పద్నాలుగు వేల క్యూసెక్ ల నీటిని విడుదల చేసింది. ఇప్పటికే వరద నీరు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ చేరింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి 5వేల క్యూసెక్ ల నీటిని దిగువకు విడుదల చేశారు. కృష్ణా నదికి వరద ఉధృతి పెరిగింది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతోంది.