Army Major Died Heart Attack : సంక్రాంతికి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండెపోటుతో మృతి

వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగకు జమ్మూకశ్మీర్ నుంచి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన పరకాలలో చోటు చేసుకుంది.

Army Major Died Heart Attack : సంక్రాంతికి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండెపోటుతో మృతి

Army Major died

Updated On : January 15, 2023 / 10:08 AM IST

Army Major Died Heart Attack : వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. సంక్రాంతి పండుగకు జమ్మూకశ్మీర్ నుంచి సొంతూరుకు వచ్చిన ఆర్మీ మేజర్ గుండె పోటుతో మృతి చెందారు. ఈ ఘటన పరకాలలో చోటు చేసుకుంది. పండుగతో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయులు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా పరకాల పట్టణానికి చెందిన దూడపాక సాయికిరణ్ (32) అనే వ్యక్తి జమ్మూకశ్మీర్ లో ఆర్మీ మేజర్ గా విధులు నిర్విర్తిస్తున్నారు.

సంక్రాంతి పండుగ కోసం సెలవులప నాలుగు రోజుల క్రితం సొంతూరైన పరకాలకు వచ్చారు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉన్న సాయికిరణ్ శనివారం ఇంట్లోని బాత్ రూమ్ కు వెళ్లి వచ్చి కుర్చీలో కూర్చున్నారు. ఇంతలోనే హఠాత్తుగా ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో కుర్చీలోనే కుప్పకూలిపోయారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Manoj Singh Mandavi Died : ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ గుండె పోటుతో మృతి

అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పండుగ కోసం ఇంటికి వచ్చిన సాయికిరణ్ చనిపోవడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. అతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.