Anchor: హైదరాబాద్ లో యాంకర్ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ నగరంలో యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఆత్మహత్యయత్నం చేశారు. నహిదా ఖాద్రి అనే యువతి ఓ యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు.

Anchor: హైదరాబాద్ లో యాంకర్ ఆత్మహత్యాయత్నం

Anchor

Updated On : June 13, 2021 / 12:40 PM IST

Anchor: హైదరాబాద్ నగరంలో యూట్యూబ్ ఛానల్ యాంకర్ ఆత్మహత్యయత్నం చేశారు. నహిదా ఖాద్రి అనే యువతి ఓ యూట్యూబ్ ఛానెల్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు. నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లిన నహిదాను కుటుంబ సభ్యులు ఒవైసీ ఆసుపత్రికి తరలించారు.

 

ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన చావుకు డబీర్ పుర కాంగ్రెస్ లీడర్ సలీం అని వీడియోలో తెలిపారు. గత కొంత కాలంగా సలీం తనను వేధిస్తున్నాడని నహిదా పేర్కొంది. తన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి మానసికంగా వేధిస్తున్నాడని ఆరోపించారు.

 

అనంతరం ఆమె నిద్రమాత్రలు మింగారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చంద్రాయనిగుట్ట పోలీసులు సలీంను అదుపులోకి తీసుకున్నారు.