Selfie Video : రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సెల్ఫీ వీడియో.. సంచలన విషయాలు వెల్లడి

తమ ఆస్తి తగాదాల్లో రాఘవ జోక్యం చేసుకున్నారని ఏడాది కాలంగా తన తండ్రి ఆస్తి తనకు రాకుండా వనమాతో కలిసి అక్క, అమ్మా అడ్డుకున్నారంటూ ఆరోపించారు.

Ramakrishna suicide case : సంచలనం సృష్టించిన రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సెల్ఫీ వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో వనమా రాఘవ, తన తల్లి, అక్కపై రామకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. తన ఆత్మహత్యకు పాత్రధారి, సూత్రధారి వనమా రాఘవ అంటూ రామకృష్ణ ఆరోపించారు. తమ ఆస్తి తగాదాల్లో రాఘవ జోక్యం చేసుకున్నారని.. ఏడాది కాలంగా తన తండ్రి ఆస్తి తనకు రాకుండా వనమాతో కలిసి అక్క, అమ్మా అడ్డుకున్నారంటూ ఆరోపించారు. వనమాతో కలిసి అక్క, అమ్మా ఇబ్బంది పెట్టారని రామకృష్ణ ఆరోపించారు. తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయినా తన గురించి అమ్మ, అక్క ఆలోచించలేదని రామకృష్ణ అన్నారు.

రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ పోలీసులకు చిక్కిన వనమా రాఘవపై విచారణ కొనసాగుతోంది. కొత్తగూడెంలోని ఏఎస్పీ కార్యాలయంలోనే ప్రస్తుతం రాఘవను విచారిస్తున్నారు.. పోలీస్ స్టేషన్‌ వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు.. అటు రామకృష్ణ తల్లి, అక్క ఇళ్ల వద్ద కూడా పోలీస్‌ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు.. విచారణ పూర్తయిన తర్వాత కోర్టులో హాజరుపరుస్తారని తెలుస్తోంది. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఎ-2గా వనమా రాఘవ ఉన్నాడు.

High Court : జనం గుమిగూడకుండా నిషేధించండి.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

కేసుకు సంబంధించి పోలీసులు రాఘవను ప్రశ్నిస్తున్నారు. నిజానికి వనమా రాఘవను పోలీసులు అంతకముందే అదుపులోకి తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ వనమా రాఘవ తమకు దొరకలేదంటూ కొత్తగూడెం పోలీసులు ప్రకటించడంతో గందరగోళం నెలకొంది. రామకృష్ణ సూసైడ్‌ నోట్‌, సెల్ఫీ వీడియో ఆధారంగా రాఘవపై కేసు నమోదు చేశారు పోలీసులు.. రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు.. ఈ నెల 3 నుంచి అజ్ఞాతంలో ఉన్న రాఘవను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ సునీల్‌దత్‌ నిర్ధారించారు.. రాఘవతో పాటు ఇద్దరు అనుచరులను కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు.. రాఘవపై పలు పాత కేసులను సైతం బయటికి తీసి పోలీసులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది..

రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెప్పినవన్నీ నిజాలేనా? రామకృష్ణ ఆస్తి వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకున్నారా? రామకృష్ణ భార్యను మీ వద్దకు పంపమన్నారా? వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో మీ పాత్ర ఏంటి? ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటానికి కారణాలు ఏంటి? అన్న కోణంలో రాఘవను పోలీసులు విచారించే అవకాశం ఉంది..

Telangana : జోనల్, మల్టీ జోనల్ కేడర్ కేటాయింపు పూర్తి

అయితే విచారణను ఈ రెండు కేసులకే పరిమితం చేస్తారా లేక ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఆరోపణలపై జరుపుతతారా? అన్నది తెలాల్సి ఉంది.. అసలు రాఘవ ఏ ధైర్యంతో ఇన్ని రోజులు తప్పించుకోని తిరిగాడు? ముందుస్తు బెయిల్ తీసుకోవడానికే రోజుకో ప్రాంతం మారాడా అన్నది తేలాల్సి ఉంది.. అయితే బెయిల్‌పై బయటికి వచ్చి మళ్లీ పాత పద్ధతిలోనే ముందుకు వెళతాడా? కొన్ని రోజులు సైలెంట్‌గా ఉండి తన ప్రతాపం చూపుతాడా? అన్న ప్రశ్నలకు ఇప్పుడైతే సమాధానలు లేవు. కానీ రాఘవకు బెయిల్‌ రాకుండా కౌంటర్లు దాఖలు చేస్తామన్న పోలీసుల మాటలు మాత్రం ఆచరణలోకి వస్తాయో లేదో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు