Telangana : జోనల్, మల్టీ జోనల్ కేడర్ కేటాయింపు పూర్తి

22 వేల 418 మంది ఉపాధ్యాయుల్లో 21 వేల 800 మంది వారి కొత్త ప్రదేశాల్లో చేరారు. జోనల్, మల్టీ జోనల్ కేడర్‌ కేటాయింపును కూడా అధికారులు పూర్తి చేశారు.

Telangana : జోనల్, మల్టీ జోనల్ కేడర్ కేటాయింపు పూర్తి

Telangana

Zonal and multi-zonal cadre : తెలంగాణలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం ఉద్యోగుల విభజన, బదిలీలు పూర్తయ్యాయని తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ అన్నారు. పోస్టింగ్‌లకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జోనల్, మల్టీ జోనల్ కేడర్‌ కేటాయింపును కూడా అధికారులు పూర్తి చేశారు.

22 వేల 418 మంది ఉపాధ్యాయుల్లో 21 వేల 800 మంది వారి కొత్త ప్రదేశాల్లో చేరారు. ఇప్పటికే 13,760 మంది ఇతర జిల్లా కేడర్ ఉద్యోగులు తమ కొత్త పోస్టింగ్‌ల్లో చేరారు. ఈ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం తక్కువ వ్యవధిలో పూర్తి చేసింది.

China : బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ ట్రైన్

రాష్ట్రపతి ఉత్తర్వులను పారదర్శకంగా అమలు చేసినందుకు జిల్లా కలెక్టర్లు, కార్యదర్శులు, విభాగాధిపతులు, అధికారులకు సీఎస్ సోమేష్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్తర్వుల అమలుతో స్థానిక యువతకు 95 శాతం రిజర్వేషన్‌తో ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు వెల్లడించారు.