China : బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ ట్రైన్

చైనా రాజధాని బీజింగ్ - జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది.

China : బీజింగ్ ఒలింపిక్స్ కోసం చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ ట్రైన్

China

Driverless special bullet train : ఫిబ్రవరిలో జరుగబోయే బీజింగ్ ఒలింపిక్స్ వింటర్ గేమ్స్ కోసం చైనా ప్రత్యేక బుల్లెట్ రైలును ప్రారంభించింది. డ్రైవర్ లేకుండా నడిచే బుల్లెట్‌ రైలును ప్రత్యేకంగా తయారు చేశారు. కేవలం ఒలింపిక్స్ కోసం కొత్త బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. డ్రైవర్ లెస్ ఫ్యూక్సింగ్ బుల్లెట్ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి ఉన్న ఎనిమిది క్యారేజీలలో 564 మంది ప్రయాణించగలరు.

చైనా రాజధాని బీజింగ్ – జాంగ్జియాకౌ నగరాల మధ్య ప్రయాణీకులను తీసుకెళ్లడానికి దీనిని ప్రారంభించింది. ఇందులో 5జీ సౌకర్యం గల లింక్డ్ బ్రాడ్ కాస్ట్ స్టూడియో ఉంది. దీని ద్వారా వీడియో లైవ్ చేసుకున అవకాశం ఉంటుంది.

Srisailam : శ్రీశైలం దేవ‌స్థానం కీల‌క నిర్ణయం.. సాంప్రదాయ దుస్తుల్లో వస్తేనే దర్శనం

బీజింగ్ డౌన్ టౌన్ జిల్లా నుంచి జాంగ్జియాకౌలోని ఒలింపిక్స్ గేమ్స్ జరిగే వేదికలకు ప్రయాణీకులను తరలించడానికి కేవలం 50 నిమిషాలు పడుంది. 2018లో ఈ రైల్వే నిర్మాణం ప్రారంభమైంది. కేవలం ఏడాది కాలంలోనే 2019లో ఈ మార్గాన్ని పూర్తి చేశారు.