Nagarjunasagar Bypoll : సాగర్‌ ఉప ఎన్నిక..పోలింగ్‌ సమయం రెండు గంటలు పెంపు

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Nagarjunasagar by-election

Nagarjunasagar by-election : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 346 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. హాలియాలోని ప్రభుత్వ సిబ్బందికి ఐటిఐ కాలేజీలో పోలింగ్‌ సామాగ్రిని అందజేస్తున్నారు.

కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో పోలింగ్‌ సమయాన్ని అధికారులు రెండు గంటలు అదనంగా పెంచారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని కేంద్ర ప్రభుత్వ ఐటిఐ కాలేజీలో.. ఉప ఎన్నికకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు పోలింగ్‌ అధికారులు, ఇద్దరు హెల్త్‌ అధికారులను నియమించామని రిటర్నింగ్‌ అధికారి రోహిత్ సింగ్‌ చెప్పారు. కోవిడ్‌ ఉధృతి ఎక్కువగా ఉండటంతో సిబ్బందికీ, ఓటర్లకు శానిటైజర్‌, హ్యాండ్‌ గ్లౌజ్‌ అందిస్తున్నామన్నారు.