Indravelli Sabha : వారి ఓటు బ్యాంకే టార్గెట్‌‌గా, ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తి

మళ్లీ పుంజుకోవాలి.. కారు పార్టీ జోష్‌కు బ్రేక్‌ వేయాలి.. ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలి... ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న పెద్ద పని. దీని కోసమే హస్తం పార్టీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. దూరమవుతోన్న దళిత దండును కలుపుకుపోయేలా ఇంద్రవెల్లి సభకు శ్రీకారం చుట్టింది.

Indravelli Sabha : వారి ఓటు బ్యాంకే టార్గెట్‌‌గా, ఇంద్రవెల్లి సభకు ఏర్పాట్లు పూర్తి

Revanth

Updated On : August 8, 2021 / 8:51 PM IST

Indravelli Sabha : మళ్లీ పుంజుకోవాలి.. కారు పార్టీ జోష్‌కు బ్రేక్‌ వేయాలి.. ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలి… ఇదే ఇప్పుడు కాంగ్రెస్‌ ముందున్న పెద్ద పని. దీని కోసమే హస్తం పార్టీ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. దూరమవుతోన్న దళిత దండును కలుపుకుపోయేలా ఇంద్రవెల్లి సభకు శ్రీకారం చుట్టింది. దళితులు, గిరిజనుల ఓటుబ్యాంకే టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్‌ వ్యూహాలకు పదునుపెడుతోంది. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

Read More : Apple iPhone : ఐఫోన్ 13 వచ్చేస్తోంది..ఎప్పుడంటే

వీరితో పాటు కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా దళిత, గిరిజన దండోరా చేపట్టేందుకు సిద్ధమైంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరగనున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్‌ తలపెట్టిన దళితబంధు పథకానికి కౌంటర్‌గా దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా పేరుతో సుదీర్ఘ కార్యక్రమాన్ని చేపట్టింది టీకాంగ్రెస్‌. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ దళిత, గిరిజనులను కదిలించేందుకు ఆగస్ట్‌ 9 నుంచి సెప్టెంబర్‌ 17 వరకూ ఈ దండోరా మోగించేందుకు సిద్ధమైంది. అమరవీరుల స్తూపం సాక్షిగా దళిత- గిరిజనుల హక్కుల కోసం పోరాడతామంటున్నారు కాంగ్రెస్‌ నేతలు.