Shamshabad Airport : బ్యాటరీలో మూడు కిలోల బంగారం .. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏపీ వ్యక్తి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి అక్రమంగా బంగారం తరలించగా అధికారులు పసిగట్టారు.మూడు కిలోల బంగారాన్ని స్వాధీనంచేసుకున్నారు.

shamshabad airport gold smuggling : ఎంత నిఘా ఉన్నా..ఎంతమంది పట్టుబడుతున్నా విమానాల్లో బంగారం, మత్తు పదార్ధాలు వంటి అక్రమ రవాణాలు కొనసాగుతునే ఉన్నాయి. కష్టమ్స్ అధికారులు నిఘా నుంచి తప్పించుకోలేక పోతున్నారు అక్రమార్కులు. ఈక్రమంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయమంలో మరోసారి బంగారం భారీగా పట్టుబడింది. దుబాయ్ నుంచి ఓ వ్యక్తి బంగారాన్ని తరలించటానికి ఉపయోగించిన అతి తెలివిని కస్టమ్స్ అధికారులు పసి గట్టేయటంతో అడ్డంగా బుక్ అయ్యాడు.

బంగారం తరలించటానికి సదరు వ్యక్తి ఎమర్జన్సీ లైట్ ను ఉపయోగించాడు.బ్యాటరీలైటులో దాదాపు మూడు కిలోల బంగారాన్ని అమర్చి తరలించటానికి యత్నించగా శంషాబాద్ లో అధికారులు పసిగట్టి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ బంగారం విలువ రూ. 1,81,60,450లు ఉంటుందని అంచనా వేశారు.

బుధవారం (మే 24, 2023) తెల్లవారుజామున 3:00 గంటలకు ఎమిరేట్స్ విమానం EK-524 ద్వారా దుబాయ్ నుండి వచ్చిన ఒక వ్యక్తిపై అనుమానంతో హైదరాబాద్ కస్టమ్స్, RGIA యొక్క కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ ద్వారా అడ్డగించారు.
వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షించారు. అతని లగేజ్ తనిఖీ చేయగా.. ఓ ఎమర్జెన్సీ లైట్ కనిపించింది. దానిపై అనుమానం రావటంతో ఎమర్జెన్సీ లైట్‌ని తెరిచి క్షుణ్ణంగా తనిఖీ చేయగా..లైట్‌లోని బ్యాటరీ భాగంలో 2915 gms బరువున్న బ్యాటరీ ఆకారంలో బంగారం ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో అతగాడి అతి తెలివి బయటపడింది.బంగారాన్ని నల్లటి కవర్‌లో చుట్టి ఎమర్జెన్సీ లైట్‌లో బ్యాటరీ స్థానంలో అమర్చాడు సదరు వ్యక్తి. భారతీయ కస్టమ్స్ చట్టం, 1962 కింద ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ప్రయాణికుడు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


								

ట్రెండింగ్ వార్తలు