TSPSC: మరో ముగ్గురు అరెస్టు.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో కొనసాగుతున్న అరెస్ట్‌ల పర్వం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఖమ్మం చెందిన ఆదిత్య నవీన్‌, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్‌ సుమన్‌‌లు ఉన్నారు.

TSPSC Paper Leakage Case

TSPSC Paper Leakage : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో అరెస్టుల పర్వం కొనసాగుతోనూ ఉంది. మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో ఖమ్మం చెందిన ఆదిత్య నవీన్‌, గుగులోతు చంటి, సూర్యాపేటకు చెందిన ఎల్‌ సుమన్‌‌లు ఉన్నారు.ఈనెల 25 వరకు వీరికి జ్యుడీషియల్‌ రిమాండ్ విధించారు. అయితే, ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టుల సంఖ్య 77కు చేరుకుంది. సోమవారం మున్సిపల్ ఏఈ ఎగ్జామ్‌లో 16వ ర్యాంకు సాధించిన నాగార్జునను పోలీసులు అరెస్టు చేశారు. ఆ ఒక్కరోజే సిట్ అధికారులు 19మంది అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోల రమేష్ నుంచి ఏఈ ఎగ్జామ్ పేపర్ కొన్న వారిని సిట్ అధికారులు అరెస్టు చేస్తూ వస్తున్నారు.

TSPSC Paper Leakage : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ప్రమేయమున్న 37 మంది డిబార్

మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజును సిట్ అధికారులు అరెస్టు చేశారు. పోల రమేష్ నుండి నాగరాజు రూ.30 లక్షలు చెల్లించి పేపర్ కొనుగోలు చేశాడు. పోల రమేష్ వ్యవహారంపై సిట్ అధికారులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. రమేష్ కాల్‌డేటా ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

ప్రధాన నిందితుడు ప్రవీణ్ ద్వారా రమేష్‌కు ప్రశ్నాపత్రం అందినట్లు గుర్తించిన అధికారులు .. మాస్ కాపీయింగ్ ద్వారా ఏఈఈ, ఈఏఓ పరీక్షలో పాల్గొన్న ఏడుగురు నిందితులు, పరీక్షా కేంద్రం యాజమాన్యం, అధ్యాపకుల సహకారంతో పోలరమేష్ మాస్ కాపియింగ్ ఒప్పందంలో భారీగా నగదు చేతులు మారినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈనెలాఖరు వరకు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో మరో 30మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు