Arvind Kejriwal: హైదరాబాద్‌కు వస్తున్నాను.. కేసీఆర్‌ను కలుస్తాను: కేజ్రీవాల్

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా కేజ్రీవాల్ కోరారు.

Arvind Kejriwal

Centre’s Delhi ordinance: రేపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ (Hyderabad)కు రానున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) తో భేటీ కానున్నారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు కేజ్రీవాల్. పార్లమెంటులో కేంద్ర ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని కేసీఆర్ ను కేజ్రీవాల్ కోరనున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగవిరుద్ధ, అప్రజాస్వామిక ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు చెప్పారు.

మరోవైపు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కూడా కేజ్రీవాల్ కోరారు. ఈ విషయాన్ని తెలుపుతూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. సమాఖ్య విధానంపై దాడి జరుగుతోందని, బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని ఆయన అన్నారు.

పార్లమెంటులో ఇందుకు వ్యతిరేకంగా పోరాడేందుకు తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ ను కోరుతామని చెప్పారు. అయితే, కాంగ్రెస్ తో ఆప్ కు ఉన్న విభేదాల దృష్ట్యా కేజ్రీవాల్ ఆ పార్టీ అగ్రనేతలను కలిసే అవకాశం వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Rahul Gandhi Passport : రాహుల్ గాంధీకి ఊరట.. పాస్‌పోర్ట్‌ జారీపై అభ్యంతరం లేదన్న రౌస్ అవెన్యూ కోర్టు